సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు అప్‌క‌మింగ్ ఫిల్మ్ వ‌న్‌పై ప్రత్యేక దృష్టిను పెట్టాడు. వ‌న్ మూవీకు విప‌రీత‌మైన బ‌డ్జెట్ పెరిగిపోవ‌డ‌మే కాకుండా, మూవీకు సంబంధించిన బిజినెస్ కూడ ఇంకా ఊపు అందుకోక‌పోవ‌డంతో వ‌న్ మూవీకు సంబంధించిన క్యాలిటీ అవుట్‌పుట్‌పై తెగ జాగ్రత్తప‌డుతున్నాడు. వ‌న్ మూవీ షూటింగ్ అంతా పూర్తి చేసుకొని, డిసెంబ‌ర్ 22న ఆడియో రిలీజ్‌కు సిద్దం అవుతుండ‌గా మరో ప్రక్క వ‌న్ మూవీ పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు కూడ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. పోస్ట్‌ప్రొడ‌క్షన్‌లో మూవీకు సంబంధించిన కొన్ని వీక్ సీన్స్‌ను తొల‌గించి, బోర్ లేకుండా చూడాల‌ని ద‌ర్శకుడు సుకుమార్‌కి ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్రత్యేకంగా చెప్పిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వినిపిస్తున్నటాక్‌. అదే విధంగా వ‌న్ మూవీకు సంబంధించిన రీ షూట్స్ ఏమైన ఉంటే వాటిని డిసెంబ‌ర్‌లోనే పూర్తి చేసుకోవ‌ల‌సిందిగా మ‌హేష్‌బాబు నిర్మాత‌ల‌కు కూడ వివ‌రించాడంట‌. వ‌న్ మూవీ షూటింగ్ బాగా ఆల‌స్యం కావ‌డంతో ఆ ఎఫెక్ట్ కార‌ణంగా మూవీపై నెగిటివ్ టాక్ రాకుండా జాగ్రత్త ప‌డాల‌ని, మూవీకు సంబంధించిన ఏదోక కొత్త న్యూస్‌ను ఎప్పటిక‌ప్పుడు మీడియాకు రిలీజ్ చేయాల్సిందిగా నిర్మాత‌ల‌కు ప్రిన్స్ సూచించిన‌ట్టు టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మ‌హేష్‌బాబు ఆగుడు మూవీకు సంబంధించిన షూటింగ్స్‌లో బిజిగా ఉంటున్నాడు. ఓ ప‌క్క ఆగ‌డు మూవీ షూటింగ్స్‌లో పార్టిసిపెట్ చేస్తూనే, మ‌రో ప‌క్క వ‌న్ మూవీ పోస్ట్ ప్రొడ‌క్షన్స్ ప‌నుల‌పై స్పెష‌ల్ కేరింగ్‌ను తీసుకుంటున్నాడు. ప్రిన్స్ వ‌న్ మూవీపై కేర్ తీసుకోవ‌డంతో చిత్ర యూనిట్ కూడ సంతోషాన్ని వ్యక్తప‌రుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: