బాలీవుడ్ బ్యూటీ కంగ‌నార‌నౌట్ కొత్త విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. ఫిల్మ్‌ఫేర్ మ్యాగ్జైన్ కోసం ఫోటోషూట్ ఇచ్చింది కంగ‌నార‌నౌట్‌. కేవ‌లం ఫోటోషూట్ ఇవ్వడ‌మే కాకుండా త‌న వ్వక్తిగ‌త జీవితానికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను కూడ చెప్పుకొచ్చింది. ఇప్పటి వ‌ర‌కూ బాలీవుడ్‌లో చాలా మంది హీరోల‌తో డేటింగ్ చేసిన కంగ‌నార‌నౌట్‌, పెళ్ళి విష‌యంలో కాబోయో భ‌ర్త ఎలా ఉండాల‌న్నదానిపై కొన్ని విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. కాబోయో భ‌ర్త ఎలా ఉండాల‌నుకుంటున్నారు అని రిపోర్టర్ అడిగితే దానికి ఈ విధంగా స‌మాధానం ఇచ్చింది. 'నాకు కాబోయో భ‌ర్త న‌న్ను గౌర‌వించే వాడిలా ఉంటే నాకు చాలు. అత‌ని వ‌ద్ద నుండి నేను అదే కోరుకుంటున్నాను. కాని నేను ఇప్పటిలో పెళ్ళి చేసుకోవాల‌ని అనుకోవ‌డం లేదు. ఎందుకంటే వైవాహిక జీవితం మీద నాకు అంత ఆస‌క్తి లేదు. నా కోస్టార్స్‌లో కొంత మంది పెళ్ళి చేసుకున్నారు. కాని ప్రస్తుతం వాళ్ళ జీవితం అంత సాఫిగా లేదు. పెళ్ళి ముందు అన‌కున్న మాట‌లు త‌రువాత ఉండ‌వు' అని చెప్పుకొచ్చింది. అలాగే రిపోర్టర్ మ‌రో ప్రశ్నను అడిగాడు. 'మీపై ఇప్పటికే ఎఫైర్స్ ఉన్నాయంటూ టాక్స్ వినిపిస్తున్నాయి క‌దా. కాబోయో భ‌ర్తకి ఎఫైర్స్ ఉన్నాయ‌ని తెలిసినా మీరు చేసుకుంటారా? దాన్ని ఎలా ఒప్పుకుంటారు?' అన్నదానికి కంగానా చాలా ఓపెన్‌గా స‌మాధానం ఇచ్చింది. 'నా కాబోయో భ‌ర్తకు ఎఫైర్ ఉన్నా నాకు అభ్యంత‌రం లేదు. కాని న‌న్ను గౌర‌వించ‌క‌పోతేనే ఇబ్బంది' అంటూ ముగించేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: