ఇదే అనుమానం అందరికీ వచ్చింది. సడెన్ గా ఎందుకొచ్చిందనా? దానికో కారణం ఉంది. రీసెంట్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఓ ఫొటో ప్రత్యక్షమయ్యింది. అదే ఇలాంటి ప్రశ్నల్ని అందరి బుర్రల్లో రేకెత్తించింది. ఓ సైట్లో దర్శకుడు హరీష్ శంకర్ షారుఖ్ ఖాన్ తో అతి సన్నిహిత్యంగా ఉన్న ఫొటో ఒకటి కనిపించింది. దాంతో అందరిలో ఎక్కడ లేని అనుమానాలూ వచ్చేశాయి. కొంపదీసి హరీష్ హిందీ సినిమా చేసేస్తున్నాడా, అది కూడా షారుఖ్ తో చేస్తున్నాడా, తెలుగులో అవకాశాలు లేక అల్లాడుతుంటే అతడికి హిందీలో అంత పెద్ద హీరోతో చాన్స్ ఎలా వచ్చింది అంటూ అనుమానాలతో ఉక్కిరిబిక్కరి అయిపోయారు. ఇలా అనుకోవడానికి కారణం ఉంది. ఎప్పుడు ఏ సినిమా చేస్తున్నా, ఆ సినిమా వాళ్లతో కలిసి దిగిన ఫొటోలని నెట్ వర్కింగ్ సైట్లో పెట్టడం హరీష్ కి అలవాటు. గబ్బర్ సింగ్ తీస్తున్నప్పుడు పవన్ తో ఉన్న ఫొటో పెట్టాడు. రామయ్యా వస్తావయ్యా చేస్తున్నప్పుడు ఎన్టీయార్ తో దిగిన ఫొటో పెట్టాడు. ఇప్పుడు షారుఖ్ ఫొటో పెట్టాడంటే అతడితో చేస్తున్నాడేమో, అంటే హరీష్ సడెన్ గా అంత ఎదిగిపోయాడా అనే సందేహం వచ్చింది. కానీ అంత సీన్ లేదక్కడ. అది అతడు పని చేస్తున్నప్పుడు తీసిన ఫొటో కాదు. ఆ మధ్య ఓసారి షారుఖ్ ని కలిసినప్పుడు ముచ్చటపడి తీయించుకున్న ఫొటో. కాబట్టి అనవసరంగా హరీష్ గురించి ఎక్కువ ఊహించుకోవడం అనవసరం!

మరింత సమాచారం తెలుసుకోండి: