రాజమౌళి ఈగ సినిమా విజయంతో డబ్బుతో పాటు చాలా అవార్డులు గెలుచుకున్న ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఇప్పుడు మరో సంచలనం వాయుపు అడుగులు వేస్తున్నారు, ప్రస్తుతం 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న లెజెండ్ సినిమాకి నిర్మాతగా చేస్తున్న కొర్రపాటి తాజాగా బాలీవుడ్ సంచలనం ధూమ్ 3 రైట్స్ కొన్నారట.  బారి మొత్తం చెల్లించి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసిన సాయి సినిమా విజయం పైన పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ధూమ్ సిరీస్ లో ధూమ్ మొదటి భాగం , రెండో భాగం భారి విజయాలు అందుకోడం సాయి కి కలిసొచ్చే అంశాలు, అందులో తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ సినిమా బాగా సుపరిచితం కావడం కూడా సాయి కి ఈ సినిమా వయుపు మల్లెల చేసయనే చెప్పుకోవాలి. 3 ఇడియట్స్ సినిమాతో 300 కోట్లు కొల్లగోట్టేసిన ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో ముక్య పాత్ర పోషిస్తున్నారు, అభిషేక్ బచ్చన్ అన్ని సిరీస్ లానే ఇందులో కూడా పోలిసులగా అలరించడానికి సిద్దంగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కత్రిన కైఫ్ ఈ సినిమాలో తన అందాలు ఆరోబోసింది. మొత్తానికి సినిమాకి ఉన్న క్రాజే చూస్తుంటే ఇది కచ్చితంగా 300 కోట్లు సునాయాసంగా అందుకుంటుందని విశ్లేషకుల అంచనా.  

మరింత సమాచారం తెలుసుకోండి: