ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఒన్‌-నేనొక్కడినే మూవీ ఆడియో రిలీజ్ ఈ నెల 19న ఘ‌నంగా జ‌రుగుతుంది. ఇప్పటి వ‌ర‌కూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఏ మూవీ ఆడియో రిలీజ్‌కు జ‌ర‌గ‌ని విధంగా, ఈ మూవీ ఆడియో వేడుక‌ను వైభ‌వంగా నిర్వహిస్తున్నారు. హైద‌రాబాద్‌, శిల్పక‌ళావేధిక‌లో ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జ‌రుగుతుంది. అయితే ఈ మూవీ ఆడియో వేడుక ప్రత్యక్షప్రసారాన్ని కేవ‌లం టెలివిజ‌న్స్‌లోనే కాకుండా, డైరెక్ట్‌గా ధియోట‌ర్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. అయితే వ‌న్ మూవీ ఆడియోను ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్ని థియోట‌ర్స్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారు అన్నదానికి ర‌క‌ర‌కాల వార్తలు వినిపిస్తున్నారు. కొంద‌రు మూడు వంద‌ల ధియోట‌ర్స్‌కు పైగా వ‌న్ మూవీ ఆడియో ప్రత్యక్షప్రసారాలు జ‌రుగుతుంటాయ‌ని చెబుతున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియ‌దు కాని వ‌న్ ఆడియో రిలీజ్ ప్రత్యక్షప్రసారాల‌ను మాత్రం కేవ‌లం డిజిట‌ల్ ధియోట‌ర్స్‌లోనే చేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కూ రాష్ట్రంలోని కొన్ని యు.ఎఫ్‌.ఓ ధియోట‌ర్స్ లిస్ట్‌ను ప్రిపేర్ చేశారు. వాటిల్లోlo వ‌న్ మూవీ ఆడియో రిలీజ్ లైవ్ టెలికాస్ట్ జ‌రుగుతుంది. వ‌న్ మూవీ ఆడియో రిలీజ్ ధియోట‌ర్స్ లిస్ట్‌: విజ‌య‌వాడ‌: క‌ళ్యాణ చ‌క్రవ‌ర్తి రాజ‌మండ్రి: కుమారి వైజాగ్‌: వెంక‌టేశ్వర‌ క‌ర్నూల్: ఆనంద్‌ ఖ‌మ్మం: శ్రీనివాస‌ విజ‌య‌న‌గ‌రం: ఎన్‌.సి.సి గాజువాక: మోహిని కాకినాడ: సంగీత‌ భీమ‌వ‌రం: విజ‌య‌ల‌క్ష్మీ త‌ణుకు: న‌రేంద్ర ఏలూరు: మినీ నారాయ‌ణ‌ మ‌చిలీప‌ట్నం: కె.ఎస్‌.టాకీస్‌ గుంటూరు: నాజ్‌ నెల్లూరు: న‌ర్తకి తిరుప‌తి: వెల్‌రామ్స్‌ క‌డ‌ప: అమీర్‌ అనంత‌పురం: వెంక‌టేశ్వర‌

మరింత సమాచారం తెలుసుకోండి: