ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ముఖ్యంగా కాపీ కాట్స్ ఎక్కువుగా ఉంటారు. ఒక‌రి క‌థ‌ను ఒక‌రు చెప్పకుండా కాఫి కొట్టడం జ‌రుగుతుంది. అలాగే ఒక మూవీకు సంబంధించిన ప్రమోష‌న్‌ను మ‌రో మూవీ కాఫి చేయడం జ‌ర‌గుతుంది. అయితే బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌కు సంబంధించిన విష‌యంలో ఓ టాప్ హీరోయిన్ ప‌ర్మిష‌న్ లేకుండా ప్రమోష‌న్ కోసం ఆమె ఫొటో ను ఉప‌యోగించారు. ఈ విష‌యం ఆ హీరోయిన్ వ‌ర‌కూ వెళ్ళదులే అని వాళ్ళు అనుకోవ‌డ‌మే వాళ్ళు చేసుకున్న త‌ప్పు. చివ‌రికే అదే కోటి రూపాయ‌ల న‌ష్టప‌రిహారంగా మారింది. ఇది చిన్న హీరోయిన్ విష‌యంలో జ‌రిగితే అంత టాపిక్ అయ్యి ఉండేది కాదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె విష‌యంలో ఆ మిస్టేక్ జ‌రిగింది. దీపికా ప‌దుకొనె ప‌ర్మిష‌న్ లేకుండానే ఓ బ్రాండ్‌కు సంబంధించిన ప్రమోష‌న్ జ‌రిగింది. ముంబాయ్‌లోని బాంద్ర ఏరియాలో పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ను కూడ పెట్టారు. ఈ విష‌యం తెలుసుకున్న దీపికా ప‌దుకొనె మేనేజ‌ర్ ఈమె వ‌ద్దకు తీసుకువ‌చ్చాడు. ఇంకేముందు దీపికా ప‌దుకొనె లీగ‌ల్‌గా వెళ్ళి స‌ద‌రు కంపెనీ మీద కేసు పెట్టింది. ప‌ర్మిష‌న్ లేకుండా త‌నను ప‌బ్లిసిటి కోసం వాడుకున్నందుకు నాలుగు కోట్ల రూపాయ‌ల న‌ష్టప‌రిహారం చెల్లించాల్సింగా కేసు పెట్టింది. లేటెస్ట్‌గా దానికి సంబంధించిన కేసు ఓ కొలిక్కి వ‌చ్చింది. ఫైన‌ల్‌గా ఆ కంపెనీ దీపికా ప‌దుకొనెకు కోటిరూపాయ‌లు ఇచ్చే విధంగా తీర్పు వ‌చ్చింది. నిజానికి చెప్పాలంటే ఆ బ్రాండ్‌కు దీపికాను అఫిషియ‌ల్‌గా తీసుకున్నా యాభై ల‌క్షల కంటే ఎక్కువ కాదు. కాని అన‌వ‌స‌రంగా ఇంత సాహసం చేశారు అంటూ అంద‌రూ ఆ కంపెనీ చేసిన‌ పిచ్చి ప‌నికి న‌వ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: