ఇండస్ట్రీలో కొన్ని హిట్ పెయిర్స్ ఉంటాయి. కొన్ని జంటలకయితే విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఎన్నేళ్లు గడిచినా వాళ్లు మళ్లీ కలిసి నటిస్తే చూద్దామని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి జంటల్లో అమితాబ్, రేఖ మొదటి స్థానంలో ఉంటారు. వీళ్లిద్దరికీ క్రేజ్ ఏర్పడానికి కారణాలు రెండు. అప్పట్లో వీళ్లు నటించిన సినిమాలన్నీ సక్సెస్ కావడం ఒకటైతే... ఇద్దరి మధ్య అఫైర్ నడవడం రెండో కారణం. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అమితాబ్ జయను పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు, వారి అఫైర్ కు ఒకేసారి బ్రేక్ పడింది. అప్పట్నుంచీ వీళ్లు కలిసి నటించింది లేదు. అయితే కొంతకాలంతా అమితాబ్, రేఖలను ఒకే ఫ్రేమ్ లో కట్టిపారేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వర్కవుట్ కాలేదు. దాన్ని ఇప్పుడు యశ్ రాజ్ సంస్థ నిజం చేయబోతోందని తెలిసింది. త్వరలో ఈ సంస్థ తీయబోయే ఓ సినిమాలో వీరిద్దరినీ తీసుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇద్దరూ సమ్మతించడానికి సిద్ధంగానే ఉన్నారని కూడా తెలుస్తోంది. ఈ వార్త వినగానే బాలీవుడ్ వారి కళ్లముందు నాటి వాళ్ల కెమిస్ట్రీ కళ్లముందు కదలసాగింది. ఈ క్రేజీ కాంబినేషన్ ను మళ్లీ చూసి ఎంజాయ్ చేయొచ్చని ఆనందపడిపోతున్నారు వాళ్లు. మన దక్షిణాదివారు కూడా కమల్ హాసన్, శ్రీదేవి మళ్లీ నటిస్తే చూద్దామని ఉవ్విళ్లూరుతున్నారు కదా! ఇది కూడా అలాంటిదేనన్నమాట. చూద్దాం... వాళ్లు కలిసి నటించడానికి ఒప్పుకుంటారో లేక వాళ్ల అఫైర్ కి బ్రేక్ వేసినట్టుగానే ఇప్పుడు కూడా జయ బ్రేక్ వేస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి: