టాలీవుడ్ నుండి భారీ ఆఫ‌ర్‌తో బాలీవుడ్‌కి చెక్కేసిన గోవా బ్యూటి ఇలియానకు ఇప్పుడు మంచి టైం న‌డుస్తుంద‌ని అంటున్నారు. బ‌ర్ఫీ మూవీతో బాలీవుడ్‌లో మంచి మార్కులు కొట్టేసి, త‌రువాత కొంత గ్యాప్ ఇచ్చినా, ఇప్పుడు మాత్రం వ‌రుస ఆఫ‌ర్లతో బిజిబిజిగా లైఫ్‌ను గ‌డుపుతుంది. రీసెంట్‌గా షాహిద్‌క‌పూర్‌తో న‌టించిన ఫ‌టాపోస్టర్‌నిక్లాహీరో మూవీ బాక్సాపీస్ వ‌ద్ద సూప‌ర్ స‌క్సెస్‌ను కొట్టి, ఇలియాన‌కు స్టార్‌డంను క్రియోట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలియాన మ‌రో కొత్త బాయ్‌ప్రెండ్‌ను సెల‌క్ట్ చేసుంది. ఎప్పుడైతే ఈ గోవా బ్యూటీ బాలీవుడ్‌కు చెక్కేసిందో, ఆ క్షణం నుండే బాలీవుడ్ క‌ల్చర్‌ను ఫాలోఅవుతుంది. ఇప్పటికే ఇలియాన చాలా మంది బాలీవుడ్ హీరోల‌తో ఎఫైర్‌ను కంటిన్యూ చేస్తుంద‌ని టాక్స్ వినిపిస్తుంటే, వాటికి మాత్రం ఇలియాన స్ట్రాంగ్‌గానే స‌మాధానం చెప్పింది. స‌రైన ఆధారాలు ఉంటే చూపించండి అంటూ ఆరోప‌న‌లు చేసిన వారికే ప‌ని చెప్పింది. దీంతో అంద‌రూ ఆ ఆధారాల‌ను వెతికే ప‌నిలో ఉన్నారు. ఇంత కాలానికి ఇలియాన ఎవ‌రితో డేటింగ్ చేస్తుందో స‌రైన ఆధారాల‌ను బిటౌన్ మీడియా చూపిస్తుంది. ఎట్‌ప్రెజెండ్ ఇలియాన సైఫ్అలీఖాన్ స‌ర‌స‌న హ్యాపీ ఎండింగ్ మూవీలో న‌టిస్తుంది. ఇందులో ఇలియాన గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌బోతుంది. సైఫ్అలీఖాన్‌తో ఇప్పటికే కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో న‌టించి అందరిని ఆశ్ఛర్యప‌రిచే విధంగా త‌న ప్రతిభ‌ను చూపిందంట‌. అయితే ఇదే మూవీలోని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఓ వ్యక్తితో ఇలియాన డేటింగ్ చేస్తున్నట్టు బిటౌన్ మీడియా స్పష్టంగా చెబుతుంది. అయితే ఆ వ్యక్తి ఎవ‌రు అన్నది మీడియా బ‌య‌ట పెట్టడం లేదు. ఈ విష‌యం హీరో సైఫ్అలీఖాన్‌కి కూడ బాగా తెలుసు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: