ఈ మధ్య టాలీవుడ్లో ఎవరైనా దర్శకుడిది కానీ, హీరో హీరోయిన్లది కానీ పుట్టినరోజు ఉంటే చాలు... వాళ్ల సినిమాకి సంబంధించిన టీజరో, ట్రెయిలరో రిలీజ్ అయిపోతోంది. అనుష్క పుట్టినరోజున రుద్రమదేవి ట్రెయలర్, ప్రభాస్ పుట్టినరోజు నాడు బాహుబలి ట్రెయిలర్ రిలీజ్ కావడం చూశాం కదా. ఇప్పుడు ఓ దర్శకుడి పుట్టినరోజుకి అతడి సినిమా ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఆ దర్శకుడు ఎవరో కాదు... సురేందర్ రెడ్డి. నిన్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టినరోజు కావడంతో, అతడు డైరెక్షన్ చేస్తోన్న రేసుగుర్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఏ కారణంతో విడుదల చేసినా కానీ, ఫస్ట్ లుక్ అదిరిందన్నది మాత్రం వాస్తవం.  శృతీహాసన్, సలోని హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో... బన్నీ పోలీసాఫీసరుగా చేస్తున్నాడని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఉంది ఫస్ట్ లుక్. బన్నీ బాడీ లాంగ్వేజీలో స్టిఫ్ నెస్, ఫేసులో సీరియస్ నెస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. బన్నీ ఆవేశంగా పరిగెడుతూ ఉంటే, వెనక నుంచి అదిరిపోయే బ్యాగ్రౌండ్ వస్తోన్న వీడియో అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మాస్, యాక్షన్ చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు సురేందర్ రెడ్డి. ఈసారి బన్నీతో రఫ్పాడించేసేలానే కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో ఉన్నంత విషయం సినిమాలో కూడా ఉంటే రేసు గుర్రం దౌడు తీయడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: