ప‌ద‌మూడు సంవ‌త్సరాల‌గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన న‌ట‌న‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్న మేటి న‌టి శ్రేయ‌. శ్రేయ కెరియ‌ర్లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇటు టాలీవుడ్‌, అటు కోళీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కొన‌సాగించిన ఈ న‌టికు తాజాగా ఓ ప్రొడ్యూజ‌ర్ ఝ‌ల‌క్ ఇచ్చాడు. దీంతో శ్రేయ‌కు ఒళ్ళు మండినంత ప‌నైంది. ఆ ప్రొడ్యూజ‌ర్‌తో తాడోపేడో తేల్చుకుంటానంటూ అంద‌రితోనూ త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి చెప్పుకుంటుంది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే శ్రేయ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ చిత్రానికి ప‌నిచేస్తుంది. అక్కినేని మూడు త‌రాల చిత్రంగా తెర‌కెక్కుతున్న మనం మూవీలో శ్రేయ కూడ న‌టిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో శ్రేయ లీడ్ రోల్‌లో వ‌చ్చిన ప‌విత్ర మూవీ బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టడంతో, ఇక ఆ త‌ర‌హా మూవీల‌కు గుడ్ బై చెప్పేసింది. కాని అదే మూవీ స‌మ‌యంలో ఆ త‌ర‌హా పాత్రలో న‌టించ‌డానికి శ్రేయ ముందుగానే మరో మూవీకు అడ్వాన్స్ మ‌నీ తీసేసుకుంద‌ట‌. ప‌విత్ర మూవీ త‌రువాత ఆ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేద్ధాం అని శ్రేయ మాట కూడ ఇచ్చింద‌ట‌. కాని ప‌విత్ర మూవీ బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టడంతో, త‌ను ముందుగానే ఒప్పుకున్న ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేయాల్సిందిగా నిర్మాత‌కు చెప్పింది. ఇప్పుడు త‌ను కుద‌రదంటూ, దానికి కోటి రూపాయ‌ల వ‌ర‌కూ ఫైన్ చెల్లించాలంటూ బెదిరిస్తున్నాడంట‌. దీంతో శ్రేయాకు విప‌రీత‌మైన కోపం వ‌చ్చి, ఈ సెటిల్‌మెంట్‌ను సినీపెద్దల వ‌ద్ద తేల్చుకుందాం అంటూ నిర్మాత‌కు స‌వాల్ విసిరి వెళ్ళింద‌ట‌. కాని నిర్మాత వ‌ద్ద మాత్రం వీరిద్దరి అగ్రిమెంట్‌కు సంబంధించిన పూర్తి డ్యాక్యుమెంట్స్ ప‌క్కాగా ఉన్నాయంటూ చూపిస్తున్నాడు. చివ‌రికి ఏం జ‌రిగిద్దో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: