డిసెంబ‌ర్ 6న రిలీజ్ అయిన బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ రాంబో రాజ్‌కుమార్‌. ఈ మూవీను డైరెక్ట్ చేసింది ప్రభుదేవా కావడంతో దీనికు అంత క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వ‌ర‌కూ ప్రభుదేవా తీసిన మూవీలు అన్నీ రిమేక్ ఫిల్మ్స్ అయి, ఈ మూవీ మాత్రం సొంత డైరెక్షన్‌తో ముందుకు వ‌చ్చాడు. అందుకే ప్రభుదేవా సొంత డైరెక్షన్‌లో వ‌స్తున్న ఈ మూవీ బాక్సాపీస్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అన్నదానిని ప్రత్యక్షంగా చూడటానికి బాక్సాపీస్ పండితులు తెగ ఉత్సాహం చూపించారు. చివ‌ర‌కు అంద‌రూ ఊహించినంతగా ఈ మూవీకు అంత సీన్ లేద‌ని తేల్చిప‌డేశారు. రాంబో రాజ్‌కుమార్ రిలీజ్ అయిన మొద‌టి రోజు ప‌ది కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసింది. రెండో రోజు క‌లెక్షన్స్ తొమ్మిది కోట్లకు వ‌చ్చింది. దీంతో బాక్సాపీస్ వ‌ద్ద రాంబో రాజ్‌కుమార్‌కు స్పీడ్ త‌గ్గింద‌ని జోరుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే మూడో రోజు ఆదివారం కావ‌డంతో ఆ ఒక్క రోజే ప‌ద‌కొండు కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసింది. మొత్తంగా మూడు రోజుల క‌లెక్షన్స్ 30.59 కోట్లరూపాయ‌ల‌ను తేలింది. ఏదేమైనా ప్రభుదేవా సొంత డైరెక్షన్‌తో బాలీవుడ్‌లో చేతులు కాల్చుకున్నాడ‌ని అంటున్నారు. ఇక‌నైన రిమేక్ ఫిల్మ్స్‌ను అద్భుతంగా తీసి మ‌ళ్ళీ త‌న స‌త్తాను చాటాల‌ని ప్రభుదేవాకు హిత‌వు చేస్తున్నారు. రాంబో-రాజ్‌కుమార్ 3 రోజులు క‌లెక్షన్స్ వివ‌రాలు: మొద‌టి రోజు(DEC 6) : 10.1 కోట్లు రెండో రోజు(DEC 6)   : 9.14 కోట్లు మూడో రోజు(DEC 6) : 11.35 కోట్లు                 మొత్తం : 30.59 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: