స్టార్ హీరోలు చుట్టూ ఓ పెద్ద ప‌రివారం ఉంటుంది. వాళ్ల పేరును చెప్పుకుని ఎవ‌రి రీతిలో వాళ్లు ప‌నులు..మార్కెట్ చేసుకుంటుంటారు. ఇక స్టార్ హీరోల మేనేజ‌ర్లు అయితే ఇక ఫుల్ గా వాడేసుకోవ‌చ్చు. అఫ్ కోర్స్ అంద‌రు కాక‌పోవ‌చ్చు . కొంత మంది మేనేజ‌ర్లు మాత్రం.. హీరోల పేరును స్టార్ డ‌మ్ ను అడ్డం పెట్టుకుని బాగా చ‌క్రాలు తిప్పుతుంటారు. ఆ హీరోకు సంబంధించి ఇంట‌ర్వూలు..సినిమా క‌థలు వినిపించాల‌న్నా.. ప‌ర్స‌న‌ల్ గా క‌ల‌వాల‌న్నా ఒక్క‌టేమిటి స్టార్ హీరోల‌కు సంబంధించి ఏది చేయాల‌న్నా ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్లే కీ రోల్ ప్లే చేస్తారు. వీళ్ల‌ను ప‌ట్టుకుని..వీళ్ల‌కు కావాల్సింది అప్ప చెప్పి ప‌నులు చేయించుకునే వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీకి కొత్తేమి కాదు. అయితే స్టార్ హీరోల పేర్లు వాడుకోవ‌డంలో మ‌రి మితి మీరితే.. అది హీరోలకే బ్యాడ్ అవుతుంటుంది. మేలుకోక‌ పోతే డామేజ్ ఒక రేంజ్ లో జ‌రుగుతుంటుంది. అస‌లిదంత ఎందుకు బాబు అనుకుంటున్నారా..? మ‌న టాలీవుడ్ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒక వారంలోనే వాళ్ల ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ల‌ను తీసేశారు. అక్కినేని నాగార్జున త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న బుచ్చిరాజును.. యంగ్ టైగ‌ర్ త‌న ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ కృష్ణను తీసేసిన‌ట్లు తెలుస్తుంది. దాదాపు 10 సంవ‌త్స‌రాల పాటు ఈ ఇద్ద‌రు ఆ హీరోల ద‌గ్గ‌ర ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. వ‌న్ వీక్ గ్యాప్ లోనే ఇద్ద‌ర్ని తీసేశారంటే ఏదో జ‌రిగింది.... ? ఏదో హీరోల‌కు న‌ష్టం క‌లిగించే ప‌ని చేయ‌డం వ‌ల్లే పీకి పడేసి వుంటారని కొద్దిమంది అంటున్నారు. అంతేకాదు ముందే ప్ర‌మాదాన్ని గుర్తించి నాగ్, యంగ్ టైగ‌ర్ మంచి ప‌ని చేశారని ఇండ‌స్ట్రీలో మ‌రికొద్దిమంది అంటున్నారు. అవును ఇటువంటి వాళ్లు చేసే ప‌నులు తెలుసుకోక‌ పోతే.. తిన్నింటి వాసాల్నే మింగేసే రకాలుగా త‌యారు అవుతారు మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: