కోళీవుడ్ ఇండ‌స్ట్రీలో సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ ఫిల్మ్‌ల‌ను సాధించిన బ్లాక్‌బ‌స్టర్ డైరెక్టర్ కె.భాగ్యరాజ్. న‌టుడుగా, ద‌ర్శకుడిగా ఉన్నో వైవిధ్య భ‌రిత‌మైన మూవీల‌ను చిత్రసీమ‌కు అందించాడు. భాగ్యరాజ్ మూవీలు అన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీల‌తోనూ, క‌థా బ‌లంతోనూ ప్రేక్షకుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటాయి. చాలా గ్యాప్ త‌రువాత భాగ్యరాజ్ ఓ మూవీకు ద‌ర్శక‌త్వం చేయ‌బోతున్నాడు. భాగ్యరాజ్ మూవీలో న‌టించటానికి నేటి హీరోయిన్స్ క్యూలో ఉంటారు. కాని భాగ్యరాజ్‌కు ఓ హాట్ హీరోయిన్‌పై మ‌న‌స్సు మ‌ళ్ళింది. మ‌ల్లువుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన హావాను కొన‌సాగిస్తున్న హాట్ బ్యూటీ శ్వేతామీన‌న్‌, భాగ్యరాజ్ మూవీలో లీడ్ రోల్‌ను చేస్తుంది. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ ఇదే నెల‌లో ప్రారంభం కాబోతుంది. ఈ మూవీతో శ్వేతామీన‌న్ కోళీవుడ్ ఇండ‌స్ట్రీకు మ‌రింత ద‌గ్గర అవుతుంద‌ని అంటున్నారు. అయితే హాట్ బ్యూటీ శ్వేతామీన‌న్‌, ఈ ద‌ర్శకుడు గురించి ఈ విధంగా మాట్లాడింది. 'భాగ్యరాజ్ మూవీలో న‌టించ‌టానికి ముందు నేను భాగ్యరాజ్ గారి ఓ మూడు మూవీల‌ను చూశాను. అందులో అత‌ని మూవీలు అన్ని ప్యామిలి ఓరియంటెడ్ క‌థ‌లు. అన్ని మూవీలు ప్యామిలీ ప్రేక్షకులు చూడ‌ద‌గ్గ చిత్రాలే. కాని నేను ఈ మూవీలో న‌టించ‌డం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. భాగ్యరాజ్ మూవీలో ఓ లీడ్‌రోల్ చేస్తున్నాన‌ని త‌లుచుకుంటేనే నాకు ఆనందంగా ఉంది.' అంటూ చెప్పుకుంది. హాట్ ఫోజ్‌ల‌తో అంద‌రిని ఉక్కిరి బిక్కిరి చేసే శ్వేతా మీన‌న్‌, ఆ ప్యామిలి డైరెక్టర్ మూవీలో ఏ విధంగా కనిపిస్తుందో అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: