శింబు, హ‌న్సిక‌ల ప్రేమాయ‌ణం గురించి తెలియ‌ని వారుండ‌రు. వీరిద్దరు కోళీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌ని స్ట్రీట్ ఉండ‌దు అన్న విధంగా వీరి మ‌ధ్య ఎఫైర్ కొన‌సాగింద‌ని గ‌త రెండు సంవత్సరాల నుండి అటు కోళీవుడ్ ఇండ‌స్ట్రీ ఇటు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే వీరి ప్రేమ ఏకంగా పెళ్ళి వ‌ర‌కూ వెళుతుంద‌ని దాదాపు అంద‌రూ డిసైడ్ అయిపోయారు. అయితే అంద‌రి నోటి నుండి ఇదే మేట‌ర్ రావ‌డంతో వీరి వార్తల‌కు హ‌న్సిక కేవ‌లం ఒక‌ స‌మాధానంతో స‌రిపెట్టింది. 'మేము ఇద్దరం మంచి ప్రేండ్స్ మాత్రమే' అన్న హ‌న్సిక, శింబుతో ఉన్న ఎఫైర్ గురించి ఎటువంటి స‌మాధానం చెప్పలేదు. తిరిగి అడిగిలోపే 'ఇది మీకు సంబంధం లేని మేట‌ర్' అంటూ మ‌ళ్ళీ ఎంచక్కా రొమాన్స్ చేసుకుంటున్నారు. దీంతో మీడియా కూడ ఎప్పటి లాగే 'వీరిది బూట‌క‌పు ప్రేమ కాదు, పెళ్ళి వ‌ర‌కూ వెళ్ళే ప్రేమ' అంటూ క‌థ‌నాల‌ను ప్రసారం చేస్తుంది. అటు కోళీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ ఇదే తంతూ. ఇక స‌హించేది లేదంటూ హ‌న్సిక ఈ గాసిప్స్‌కు బ్రేక్ పెట్టాల్సిందే అంటూ, స్ట్రాంగ్‌గానే స‌మాధానం ఇచ్చింది. 'శింబుతో నాకు ఎటువంటి ఎఫైర్ లేదు. ఇదంతా మీడియా క్రియోష‌న్‌. ఎఫైర్‌ల‌కు నేను చాలా దూరం. శింబుతో న‌న్ను ముడి పెట్టి ఇప్పటి వ‌ర‌కూ న‌డిపిన క‌థ‌నాల‌కు ఇక్ ఫుల్‌స్టాప్ పెట్టేయండి. ఇదే ఫైనల్ స్టేట్‌మెంట్' అంటూ మీడియాకు స్ట్రాంగ్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక‌నైనా వీరిద్దరిపై గాసిప్స్ ఆగుతాయా? లేదా? అనేది చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: