కోలీవుడ్ లో 1975లో విడుదలైన ‘అపూర్వరాగంగళ్’ సినిమాలో నల్లగా, మాసిపోయిన గడ్డంతో దేశదిమ్మరిలా కనిపించిన ఓ వ్యక్తి. కోలీవుడ్ సినిమా రూపు రేఖలు మారుస్తాడని, ప్రాంతీయ సినిమా స్థాయిని వందకోట్ల స్థాయికి తీసుకెళ్తాడని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాధ్యుడవుతాడని, స్టార్‌డమ్ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు ఆయనే రజినీకాంత్. అమితాబ్ లాంటి ప్రముఖ హీరో ఓ ప్రాంతీయ భాషా నటుడైన రజనీని ఇప్పుడందరూ ఆలిండియా సూపర్‌స్టార్ అంటున్నారు.  రజనీ అంటే ఓ సమ్మోహనాస్త్రం. దానికి భాషతో నిమిత్తం లేదు మిస్సిండియాలు, మిస్ వరల్డులైనా సరే ఆయన స్టయిల్ ముందు ఆగరు. అయన నటనలో, నడకలో, నవ్వులో, డైలాగు విరుపులో ఎవ్వరికీ అందని మేజిక్. అదే ఆయన గొప్పతనం ప్రస్తుతం ఆయన స్టయిల్ ఓ బ్రాండ్‌గా మారిపోయింది. ఆయన అభినయ సామర్థ్యానికి స్టయిల్ అనేది ఓ ఆభరణం గా మారింది అందుకే సూపర్ స్టార్ కాగలిగాడు. ఆయనతో సమానం గా క్రేజ్ ఉన్న నటుడు మన దక్షిణ భారత దేశంలో లేరు అంటే అతిసియోక్తి కాదు. నేటితో సూపర్‌స్టార్‌కి 63 ఏళ్లు నిండుతున్నాయి. అయినా ఈ వయసులో కూడా యువతరాన్ని ప్రభావితం చేస్తున్నాడు రజని . అంతే కాదు బాలీవుడ్ సూపర్‌స్టార్లకు సైతం ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. దేశంలోనే అత్యధిక పారితోషికంగా తీసుకునే కథానాయకుడు కూడా రజనీనే. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఏ ప్రాంతీయ నటుడూ సాధించని క్రెడిట్ ఇది.  కేవలం సినిమాల వల్లే రజనీకాంత్ ఈ స్థాయికి రాలేదు అని అంటారు . అయన ప్రవర్తన కూడా ఆయన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది తన సినిమా వల్ల నష్టపోయిన పంపిణీదారులకు డబ్బు వెనక్కు ఇచ్చిన క్రెడిట్ రజని స్వంతం. రజనీ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరం రజినీకాంత్ నటించిన ‘కొచ్చాడియన్’ ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాయాలని ఆ స్పూర్తితో రజినీ మరిన్ని సినిమాలు నటించి ఆయాన అభిమానులకే కాకుండా భారతదేశ సినిమా చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని ఏర్పరుచుకోవాలని ఆకాంక్షిస్తూ ఇండియన్ రియల్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: