ఈ మధ్య కాలంలో తమ సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్స్ పుట్టినరోజున తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న రెండు భారీ సినిమాలు బాహుబలి, రుద్రమదేవి సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నారు.  ఇప్పటికే అనుష్క, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా రానా దగ్గుబాటి టైమొచ్చింది. రేపు డిసెంబర్ 14 రానా పుట్టినరోజు సందర్భంగా బాహుబలి, రుద్రమ దేవి సినిమాలకి సంబంధించి రానాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. రుద్రమదేవి సినిమాలో రానా నిడవర్ద్యపురం(నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడుగా కనిపిస్తున్న ఫాస్ట్ లుక్ పోస్టర్ ను గుణశేఖర్ ఒకరోజు ముందుగానే రిలీజ్ చేశారు.  అనుష్క, రానా జంటగా నటిస్తూ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో రానా కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ హిట్స్ లభించకపోయినా భారీ సినిమాలుగా రూపొందుతున్న ‘రాణిరుద్రమ’, ‘బాహుబలి’ సినిమాలు రానా కెరియర్ ను ఒక మలుపు తిప్పే అవకాసం ఉంది అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ఈ ఫస్ట్ లుక్ లో నిండైన రాజసంతో రానా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: