రాజ‌మౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబ‌లి మూవీలో మ‌రో పాత్ర స్వరూపం బ‌య‌ట ప‌డింది. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రలుగా తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి మూవీలో ఇప్పటికే రెండు పాత్రల‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్స్‌ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాళ్ళిద్దరే ప్రభాస్‌, అనుష్క. వీరిద్దరి ఫ‌స్ట్‌లుక్‌ల‌ను వారి బ‌ర్త్‌డే రోజున రాజ‌మౌళి బ‌య‌ట‌కు విడుద‌ల చేశాడు. ఇందులో ప్రభాస్‌, అనుష్క గెట‌ప్‌లు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా, రానా ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన‌ ఫ‌స్ట్‌లుక్స్‌లో అంద‌రి కంటే వైవిధ్యంగా రానా ఫ‌స్ట్‌లుక్ ఉంది. ఇందులో రానా చేసిన ఫీట్స్‌, యాక్టింగ్ అంద‌రిని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. రానా ఫ‌స్ట్‌లుక్‌తో బాహుబ‌లి మీద విప‌ర‌తీమైన క్రేజ్‌ క్రియోట్ అయింది. రానా ప్రతి క‌థానాయుడిగా న‌టిస్తుండ‌టంలో ఈ మూవీలో హీరోకు ధీటుగా రానా న‌ట‌న ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతుంది. బాహుబ‌లి మూవీకు సంబంధించిన ప్రతి క్యారెక్టర్‌ను రాజ‌మౌళి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. 2015లో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై బిజినెస్ సంస్థలు కూడ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. ముఖ్యంగా ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మూవీకు సంబంధించిన బిజినెస్ వ్వవ‌హారంపై రాజ‌మౌళిను సంప్రదించినట్టు వార్తలు కూడ వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాజ‌మౌళి రిలీజ్ చేసిన రానా ఫ‌స్ట్‌లుక్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: