ఎన్నో భారి ఎక్స్ పెక్టెషన్ తో సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న వన్ నేనొక్కడినే మూవీ ఆడియో టీజర్ ని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్..అత్యంత భారి బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ పాత రికార్డ్స్ అన్ని కొల్లగొట్టడం ఖాయం అని అనిపించేలా చాలెంజ్ చేస్తున్నాడు మహేష్ Who are you.. Who are you..అంటూ సాగే ఈ సాంగ్ టీజర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.. ఈ సినిమా ఆడియో ఈ నెల 19న శిల్పకళావేదిక లో రిలీజ్ చేస్తున్నారు..ఆడియోని కూడా కొన్ని సెలక్టెడ్ థియేటర్స్ లైవ్ ఇచ్చేవిధంగా ప్లాన్ చేస్తున్నారు వన్ నిర్మాతలు. ఇక సినిమా జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ తర్వాత సూపర్ స్టార్ తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోనున్నాడు. చాలా మోడ్రనేట్ గా ట్రెండీగా ఉన్న ఈ మూవీ ఆడియో టీజర్ తో మరోసారి దేవి తన మ్యూజిక్ సత్తాని ప్రదర్శించనున్నాడు.ఆకలితో ఉన్న పులికి ఒంటరిగా జింక దొరికినట్లు మహేష్ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సరైన సమాధానమిస్తూ వచ్చిన ఈ టీజర్ చూసి మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: