బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, భార్య సుసానే లు విడిపోవడానికి మరో నటుడు అర్జున్ రాంపాలే కారణమంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అర్జున్.. 'ఈ విషయంలో నాకెలాంటి సంబంధంలేదు. నాకు దగ్గరి స్నేహితులైన వారు విడిపోవాలని నిర్ణయించుకోవడం చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితులు వారికి చాలా కష్టమైనవి. అయితే, ఇదే సమయంలో వారిద్దరి మధ్య నా జోక్యం ఉందంటూ వచ్చిన గాసిప్స్ ను నేను కూడా విన్నాను, చదివాను. ఆ విషయం నన్ను తీవ్రంగా బాధపెట్టింది. ఇలాంటప్పుడు వారిద్దరూ ప్రేమ, ప్రశాంతతతో ఉండాలని నేను, నా భార్య మెహర్ కోరుకుంటున్నాము. మా వైపు నుంచి వారికెప్పుడూ మద్దతు ఉంటుంది' అని స్పష్టం చేశాడు. తన భార్య సుసానే, తాను విడిపోవడానికి నిశ్చయించుకున్నామంటూ నాలుగు రోజుల కిందట హృతిక్ ఓ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: