అమీర్‌ఖాన్‌, కిర‌ణ్‌రావు ఇద్దరూ భార్యభ‌ర్తలు. కిర‌ణ్‌రావుతో అమీర్‌ఖాన్ లివింగ్ రిలేష‌న్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై ఒక‌రికొక‌రు అనుమానాలను క్రియోట్ చేసుకున్నారు. దాన్ని ఓ టీవి ఛాన‌ల్‌లో బాహాటంగా చెప్పుకున్నారు. బాలీవుడ్ సెల‌బ్రిటీలంద‌రూ క‌ర‌ణ్‌జోహార్ రియాలిటి షోలో పార్టిసిపెట్ చేస్తారు. ఈ షోలో పార్టిసిపెట్ చేసిన సెల‌బ్రిటీలు అంద‌రూ కొన్ని ప్రశ్నల‌కు నిజామ‌లను చెప్పేస్తారు. ఆ విధంగా అమీర్‌ఖాన్‌, కిర‌ణ్‌రావుల‌ను ఓ విచిత్రమైన ప్రశ్నను అడిగాడు క‌ర‌ణ్‌జోహార్. మొద‌ట‌గా కిర‌ణ్‌రావును ఈ విధంగా అడిగాడు. 'మీ ఛాయిస్ అమీర్‌ కాకుంటే లేటెస్ట్‌గా ఎవ‌రిని సెల‌క్ట్ చేసుకుంటారు' అని అన్నాడు. కిర‌ణ్‌రావు ఏ మాత్రం ఆలోచించ‌కుండా ప‌క్కనే అమీర్‌ఖాన్ ఉన్నాడ‌ని చూడ‌కుండానే 'నాకు ర‌ణ్‌భీర్ క‌పూర్ కంఫ‌ర్ట్' అంటూ చ‌లాకీగా స‌మాధానం ఇచ్చింది. కిర‌ణ్‌రావు చెప్పిన స‌మాధానానికి అమీర్‌ఖాన్ సైతం ఆశ్ఛర్యప‌డిపోయాడు. 'వావ్ ర‌ణ్‌భీర్ క‌పూర్‌. గ్రేట్ ధాట్‌, గ్రేట్ టేస్ట్' అంటూ కిర‌ణ్‌రావును అదోలా చూశాడు. అయితే క‌ర‌ణ్‌జోహార్ ఈ సారి అమీర్‌ఖాన్‌ను ప్రశ్నించాడు. 'మీరైతే కిర‌ణ్‌రావు కాకుండా ఎవ‌రిని సెల‌క్ట్ చేసుకొని ఉండేవారు' అని అన్నాడు. కిర‌ణ్‌రావు త‌న మ‌న‌స్సులోని మాట‌ను ఏ మాత్రం బెరుకు లేకుండా చెప్పటంతో ఈ సారి అమీర్‌ఖాన్ రెచ్చిపోయాడు. 'నాకు అయితే క‌త్రినా వెరీ కంఫ‌ర్ట్' అంటూ కిర‌ణ్‌రావుకి షాక్ ఇచ్చాడు. ఈ విధంగా ఒక‌రికొక‌రూ మ‌న‌స్సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టుకోని అనుమానాల‌ను క్లియ‌ర్ చేసుకున్నార‌ని బాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: