లారెన్స్‌తో మూవీలు అంటే దాదాపు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ భ‌య‌ప‌డేంత ప‌ని అవుతుంది. ఎందుకంటే లారెన్స్ మీద న‌మ్మకంతో విప‌రీత‌మైన ఖ‌ర్చు పెట్టించి తీసిన మూవీలు అన్ని డిజాస్టర్ పిల్మ్స్‌గా మారాయి. లారెన్స్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన రెబ‌ల్ మూవీ అయితే మూవీకు పెట్టిన ఖ‌ర్చులో స‌గం డ‌బ్బుల‌ను రాబ‌ట్టుకోవ‌టానికి నిర్మాత‌ల‌కు త‌ల బొప్పి క‌ట్టింది. లారెన్స్ క‌థ‌ల‌ను విన‌డం తెలుగు నిర్మాత‌లు ఎప్పుడో మ‌ర్చిపోయారు. అలాగే హీరోలు సైతం లారెన్స్ క‌థ‌ల‌కు ఓకె చెప్పకుండా కాల్షీట్స్ బిజిగా ఉన్నాయంటూ త‌ప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే లారెన్స్ రూటు మార్చి త‌న‌కు సూప‌ర్ స‌క్సెస్‌ను అందించిన ముని సీక్వెల్స్‌ను తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఆ విధంగా ప్రస్తుతం ముని3 ఫిల్మ్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. ఈ మూవీలో లారెన్స్ స‌ర‌స‌న తాప్సీ హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే నిత్యామీన‌న్ ప్రత్యేక పాత్రలో న‌టిస్తుంది. ముని3 మూవీ త‌రువాత లారెన్స్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీకు ఎంట్రి ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తులు గ‌త సంవత్సర కాలంగా జ‌రుగుతున్నాయి. లారెన్స్ తీసిన కాంచ‌న మూవీను బాలీవుడ్‌లో రిమేక్ చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోగా అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టిస్తున్నాడు. అజ‌య్ దేవ‌గ‌న్ హీరో కావ‌డంలో కొద్దిగా మూవీకు బ‌డ్జెట్ కూడ పెరుగుతుంది. అయితే కాంచ‌న మూవీ స‌స్పెన్స్ ధ్రిల్లర్ కావ‌డంతో బాలీవుడ్‌లో లారెన్స్ హిట్ కొట్టచ్చు అని కోళీవుడ్ అంటుంది. ఏదేమైనా లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీకు ఓ బ‌డా హీరో దొర‌క‌టంతో, దాన్ని ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకుంటాడో అని అంద‌రూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: