ఈ నెల క్రిస్మస్ కు విడుదల కాబోతున్న ‘ఊయ్యాలా జంపాలా’ ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈ సినిమా కూడా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ఒక సూపర్ హిట్ సినిమాకు కాపీ అనే ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కధ చాల సంవత్సరాల క్రితం విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నువ్వేకావాలి’ సినిమాకు పోలి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  ‘నువ్వేకావాలి’ సినిమాలో హీరో, హీరోయిన్స్ చిన్ననాటి నుండి స్నేహితులు వారిద్దరికీ ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నదన్న సంగతి ఆ సినిమాలో హీరోయిన్ కు పెళ్ళి కుదిరే దాకా హీరో తరుణ్ కు తెలిసిరాదు. అదేవిధంగా ‘ఊయ్యాలా జంపాలా’ లలో కూడా హీరో హీరోయిన్స్ బావ మరదళ్ళు వీరికి కూడా ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నది అన్న సంగతి ఈ సినిమాలోని మరదలకు పెళ్లి కుదిరేదాకా హీరోకి తెలియదు. ఇలా కొద్ది కొద్ది మార్పులతో బావామరదళ్ళ ప్రేమ కధగా ఒకనాటి ‘నువ్వేకావాలి సినిమాను ‘ఊయ్యాలా జంపాలా’ గా మార్చారని టాక్.  అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పై తీస్తున్న ఈ సినిమా విరించి వర్మ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తే ఆవికా-రాజ్ తరుణ్ లు బావామరదళ్ళు గా నటిస్తున్నారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: