ఆ హీరోయిన్‌ ఉంటే చాలు… సినిమాకి మంచి డిమాండ్ ఉంటుంది… ఆ క్రేజీ హీరోయిన్‌ ఉంటే మూవీకి ప్లస్సే…. ఇలాంటి కామెంట్స్‌ అందుకున్న చాలామంది భామలకు 2013 అంతగా కలిసిరాలేదు… ఓ రేంజ్‌కి వెళ్లినవారు కూడా ఒకటి రెండు సినిమాలతో పరిపెట్టుకోవలసి వచ్చింది.కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. 2013 ఏడాది మొత్తం తెలుగు సినిమా హీరోయిన్స్ లో క్రేజీ హీరోయిన్ ఎవరంటే సమంత అనే చెప్పొచ్చు ఎందుకంటే సమంత మూడు భారీ సినిమాలు చేసింది.. అందులో మొదటిది బిగ్గెస్ట్ మల్టిస్టారర్ గా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇందులో మహేష్‌కి జోడీగా చేసిన ఈ ఆమ్మడు చాలా బబ్లీ గా చేసి మంచిమ మార్కులు కొట్టేసింది. తర్వాత రిలీజ్ అయిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాసింది.. మొదటి సారి పవన్ కి జోడిగా నటించిన సమంతకు ఆ సినిమా హిట్ కావడంతో మరింత క్రేజ్‌ పెరిగింది. చివర్లో వచ్చిన రామయ్యా వస్తావయ్య నిరాశ పరచినా అతారింటికి ఇచ్చిన కిక్ తో న్యూ ఇయర్ కి గ్రాండ్‌ వెల్కం చెప్పబోతోంది సమంత. ఇక ఇప్పటికే ఉన్నవారితో పాటు కొత్తగా వస్తున్న హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దూసుకెళ్తున్న మరో హీరోయిన్ అనుష్క. ఈ ఏడాది మిర్చి సినిమాతో ఫస్ట్ హిట్ సొంతంచేసుకుంది ఈ యోగాబ్యూటీ. ఇందులో పల్లెటూరి అమ్మయిలా అలరించిన అనుష్క ఆ సినిమా సక్సెస్ తో మరోసారి క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఇక యముడికి సీక్వెల్ గా వచ్చిన సింఘం యముడు2 కూడా మంచి మార్కులు కొట్టేయడంతో అనుష్కకు తిరేగే లేదనిపించింది. లేడీ ఓరియెంటెడ్ క్యారక్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అనుష్క అదే కోవలో వర్ణ సినిమా చేసింది. కాని ఆశించినంత విజయం దక్కకపోవడం అనుష్క బ్యాడ్‌లక్‌. మిల్కీ బ్యూటీ తమన్నాకు 2013 పెద్దగా కలిసి రాలేదు.. ఇప్పటికే స్టార్‌ హీరోలందరితో కలిసి నటించిన ఈ భామ ఒక్క పెద్ద హీరోతో కూడా నటించలేదు.. నాగచైతన్యసరసన హీరోయిన్‌గా నటించిన తడాఖా సక్సెస్‌ అయినా అది తమన్నా కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.. తెలుగు సినిమాలను పక్కన పెట్టిన బాలీవుడ్‌ బాట పట్టిన ఈ భామకు అక్కడా నిరాశే ఎదురైంది.. అజయ్‌దేవగన్‌ సరసన హీరోయిన్‌గా నటించిన హిమ్మత్‌వాలా సినిమా కూడా ఈ అమ్మడికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. మరో అందాల భామ కాజల్‌కు పెద్దగా ఆఫర్స్‌ లేకపోయినా చేసిన సినిమాలు మాత్రం పరవాలేదనిపించాయి.. 2013లోకి నాయక్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంచి సక్సెస్‌ అందుకుని గ్రాండ్గా వెల్‌కమ్‌ చెప్పింది.అయితే అదే జోరును కొనసాగించటంలో మాత్రం విఫమయ్యింది.. అంతేకాదు ఒకప్పుడు బిజీ హీరోయిన్‌ అనిపించుకున్న భామ ఈ ఇయర్‌టాలీవుడ్‌లో కేవలం రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంది. హిందీలో చేసిన స్పెషల్‌ చబ్బీస్‌ సినిమా పర్వాలేదనిపించడం కాజల్‌కు ప్లస్‌ అయింది. 1987లో జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ సరసన హీరోయిన్‌గా నటించింది కాజల్‌.. ఈ సినిమాతో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశపడుతుంది ఈ ముద్దుగుమ్మ. బలుపు సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా ఇయర్‌ని స్టార్ట్‌ చేసింది శృతిహాసన్‌… కానీ ఆ ఫామ్‌ను కొనసాగించటంలో విఫలమైంది..ఆతర్వాత ఎన్టీఆర్‌తో జోడీ కట్టి చేసిన రామయ్యవస్తాయ్య నిరాశపరచగా ఎవడు సినిమా ఇంత వరకు రిలీజ్‌ కాలేదు. ఇలా ఈ సంవత్సరం అంతా నిరాశపరిచిన శృతి నెక్ట్స్‌ ఇయర్‌ కూడా తెలుగులో చేతినిండా ఆఫర్స్‌తో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్‌ కూడా శృతి హాసన్‌ మిక్స్‌డ్‌ రిజల్ట్‌నే ఇచ్చింది. తొలిసారిగా వేశ్య పాత్రలో డిడే సినిమాలో నటించి మంచిమార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. తరువాత వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్‌తో మాత్రం భారీ ఫ్లాప్‌ను ఎదుర్కొంది. ఇక తాప్సీకి 2013 ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఒకటి రెండు సినిమాలు పరవాలేదనిపించినా ఆ క్రెడిట్‌ కూడా తాప్సీ ఎకౌంట్‌లో పడలేదు. తాప్సీ హీరోయిన్‌గా నటించిన షాడో, గుండెల్లో గోదారి సినిమాలు భారీ డిజాస్టర్‌లుగా నిలవగా సాహసం సినిమా మాత్రం పరవాలేదని పించింది.. ఇక తమిళ్‌ నటించిన ఆరంభం మంచి విజయం సాధించినా అది మల్టీ స్టారర్‌ సినిమా కావటంతో క్రెడిట్‌ తాప్సీకి దక్కకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: