ధూమ్‌3 క‌లెక్షన్స్‌కు సంబంధించిన తాజాస‌మాచారం బిటౌన్‌లో ప్రచారం జ‌రుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ధూమ్‌3 మూవీ డిసెంబ‌ర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ జ‌రిగింది. అయితే ఈ మూవీ క‌లెక్షన్స్ ఎంత అన్నది రెండో రోజు సాయంత్రం వ‌ర‌కూ క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంది. ఒక‌రు 35 కోట్ల రూపాయ‌లు అంటుంటే, మ‌రొక‌రు 45 కోట్ల రూపాయ‌లు అంటున్నారు.వీటికి సంబంధించిన లెక్కలను చూపిస్తున్నప్పటికీ, చెప్పిన ఫిగ‌ర్ కంటే క‌లెక్షన్స్ ఎక్కువుగానే క‌నిపిస్తుంది. మొత్తంగా ధూమ్‌3 మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ ఎంతో తెలిసొచ్చింది. ప్రపంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయిన ధూమ్‌3 మొద‌టిరోజు క‌లెక్షన్స్ 56.42 కోట్ల రూపాయ‌ల‌ను అని తేలింది. ఈ క‌లెక్షన్స్‌తో బాలీవుడ్ రికార్డ్స్ అన్నీ చెదిరిపోయిన‌ట్టే. ఈద్ పండుగ సంద‌ర్భంగా వ‌చ్చిన షారుఖ్‌ఖాన్ న‌టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ 33.10 కోట్ల రూపాయ‌లు. ఈ మూవీను, హృతిక్ రోష‌న్ న‌టించిన క్రిష్‌3 మూవీ బీట్ చేసింది. క్రిష్‌3 మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ 35.91 కోట్లరూపాయ‌లు. ఇప్పుడు ఈ రెండు మూవీల రికార్డ్స్‌ని ధూమ్‌3 మూవీ ఉతికి ఆరేసింద‌ని బిటౌన్ మీడియా చెబ‌తుంది. ధూమ్‌3 మొద‌టి రోజు క‌లెక్షన్స్ 56.42 కోట్ల రూపాయ‌లు ఉండటంతో వీకెండ్ క‌లెక్షన్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో 20.20 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి బాలీవుడ్ ఇండ‌స్ట్రీను అవాక్కుచేసింది. ధూమ్‌3 మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ వివ‌రాలు: హింది : 33.42 కోట్లు త‌మిళ్, తెలుగు : 2.80 కోట్లు ఓవ‌ర్సీస్ : 20.20 కోట్లు        మొత్తం : 56.42

మరింత సమాచారం తెలుసుకోండి: