యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ తన కాలేజి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నాడు. తను బ్యాడ్‌ స్టూడెంటును కాదని, అలాగని గుడ్ స్టూడెంటును కూడా కాదని. అయిన తను చేసే విపరీతమైన అల్లరి భరించలేక తన తల్లి తన చిన్న తనంలో చితకొట్టేసేది అన్నాడు. పదో తరగతి వరకూ తన అల్లరి భరించిన అమ్మా, నాన్న ఇక లాభం లేదనుకుని వడ్లమూడిలోని విజ్ఞాన్‌ కాలేజీ హాస్టల్లో వేసేశారని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.  అయితే దాని యజమాని రత్తయ్య మహా స్ట్రిక్ట్‌ అవడంతో హాస్టల్‌ చదువు వద్దని ఏడ్చినా ఎవరు పట్టించుకునేవారు కారని అంటు తన ఇంటికి ఫోన్‌ చేస్తే తన మాట వినకుండా జూనియర్ అమ్మ ఫోన్‌ కట్‌ చేసేదట. దీనితో ఇక లాభం లేదనుకుని రెండు సార్లు ఇనుప రాడ్‌తో తన కాలు తానే విరగొట్టుకున్నాదట. అనుకున్నది ఒకటి అయితే మరొకటి జరిగింది అంటున్నాడు జూనియర్. కాలేజీకి వచ్చిన తండ్రి హరికృష్ణ అతడిని ఇంటికి తీసుకువెళ్ళకుండా కట్టు కట్టించి మళ్ళీ కాలేజీ ప్రిన్స్ పాల్ రత్తయ్యకు అప్పచేప్పాడట. ఇక లాభంలేదనుకుని జూనియర్ తన కాలేజీ జీవితంలోనే తన విశ్వరూపం చూపెడితే ఆ అల్లరి తట్టుకోలేక విజ్ఞాన్ కాలేజి నుంచే బయటకు పంపించేసారట రత్తయ్య.  దీనితో తిరిగి హైదరాబాద్ వచ్చి తన రెండో సంవత్సరం హైదరాబాద్‌ సెయింట్‌మేరీస్‌లో వచ్చి పడ్డాడట జూనియర్. అక్కడ ఆ ఏడాది ఏదో మమ అనిపించి తన చదువును ఆపేసి కూచిపూడి నాట్యంలో 12 ఏళ్లు శిక్షణ తీసుకున్నా అని చెప్పాడు జూనియర్. ప్రస్తుతం హైదరాబాద్ లోనిర్మిస్తున్న తన లేటెస్ట్ సినిమా ‘రభస’ షూటింగ్ గేప్ లో ఈ విషయాలను జూనియర్ మీడియాతో షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: