కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ మూవీస్ తీసే ఈ కాలం దర్శకులు ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది దశరథ్. ఈ డైరక్టర్ కి మెగా క్యాంప్ నుండి పిలుపొచ్చింది. ఫ్యామిలీ సినిమాలు తీసే ఈ డైరక్టర్ ని మెగా హీరోలు ఓకే చేసారనే సరికి మెగా అభిమానులు తమ అభిమాన హీరో నుండి మంచి ఫ్యామిలీ సినిమా రాబోతుందని ఆశిస్తున్నారు. అప్పటి దాకా ఫ్లాప్ లో ఉన్న నాగ్ కెరియర్ ని సంతోషం సినిమాతో మరళ ఒక కొత్త ట్రెండ్ కి బాటలు వేసేలా చేసాడు దశరథ్. ఆ తర్వాత కూడా కుటుంబకథా చిత్రాలే తీస్తూ తనకంటూ ఒక మార్క్ ని వేసుకున్నాడు. ఇప్పటి కాలం సినిమాలకు టోటల్ ఫ్యామిలీ మొత్తం వెళ్లి సినిమా చూడడానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయ్.కాని దశరథ్ సినిమా వచ్చిందటే అది కచ్చితం గా కుటుంబం మొత్తం చూసే విధంగానే తీస్తాడు. సూపర్ క్రేజీ మాస్ ఫాలోయింగ్ ఉన్న మెగా హీరోలు దశరథ్ డైరక్షన్ లో చేయడమంటే చెప్పుకోదగ్గ విషయమే. ప్రభాస్ తో తీసిన మిష్టర్ పర్ఫెక్ట్ సినిమా లో కూడా గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్ గురించి చెప్పి సూపర్ హిట్ కొట్టాడు. ఈ ఇయర్ గ్రీకు వీరుడు సినిమాతో వచ్చినా అది పెద్దగా ఆడలేదు. ఇక మెగా క్యాంప్ లో తను చేయబోయే చిత్రానికి హీరో రాం చరణ్ ని తీసుకుంటాడాఅ, లేదా అల్లు అర్జున్ ని తీసుకుంటాడాఅ అన్నది తెలియాల్సి ఉంది. నిర్మాత దామోదర్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. సో డిఫరెంట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా మరో మంచి ఫ్యామిలీ సినిమా అవ్వాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: