బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మితి మీరిన శృంగారం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో ఇటువంటివి ఎక్కువుగా చూస్తున్నాం. అయితే ఇక‌నుండి బాలీవుడ్‌లోనూ హాట్ సీన్స్ ప్రభావం త‌గ్గిపోవ‌చ్చనే అంటున్నారు. దీనికి సంబంధించిన చ‌ర్యలు ఇప్పటికే మొద‌ల‌య్యాయ‌ని బిటౌన్ అంటుంది. రీసెంట్‌గా ఓ ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌లో అస‌భ్య క‌ర‌మైన లిప్‌లాక్ సీన్స్‌ ప్రేక్షకుల మ‌తి పోగొట్టుంది. ఇంత వ‌ర‌కూ బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ చేయ‌ని విధంగా ఆ లిప్ లాక్ సీన్‌ను షూట్ చేసి, ట్రైల‌ర్‌గా రిలీజ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సామాజిక సంఘాలు, బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మితిమీరుతున్న పోక‌డ‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని నిర్ణయించారు. ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుంది. ముఖ్యంగా ట్రైల‌ర్స్‌లో హ‌ద్ధులు దాటిన రొమాంటిక్ సీన్స్‌ను ప్రద‌ర్శించరాదంటూ ఆ సామాజిక సంఘాలు, ఇండియ‌న్ సెన్సార్ బోర్లు మీద తీవ్ర ఒత్తిడిని తీసుకువ‌చ్చాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్‌ ఇప్పుడు దానికి సంబంధించిన ఓ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దీని ద్వారా బాలీవుడ్‌లో ఇక నుండి మితి మీరిన రోమాంటిక్ స‌న్నివేశాలు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని బిటౌన్ అంటుంది. అయితే ఇది ఎంత వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌నేది పెద్ద ప్రశ్నగా మారింది. ఏదేమైనా సామాజిక సంఘాలు చేస్తున్న నిరంత‌ర శ్రమ‌కు సినీఅభిమానుల మ‌ధ్దతు, అలాగే సామాన్య ప్రజ‌ల మ‌ధ్దతు కూడ ఉండ‌టంతో ఇది త‌ప్పకుండా జ‌రిగితీరుతుంద‌ని కొంద‌రు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: