హ్యాపిడేస్ సినిమాతో కూల్ బోయ్ గా కనిపించిన వరుణ్ సందేష్ ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ కొట్టి లవర్ బోయ్ గా ఇమేజ్ ని కొట్టేస్తాడని అందరు అనుకున్నారు. అంతే ఆ తర్వాత కనీసం ఒక్క సినిమా అంటే ఒక సినిమా కూడా హిట్ మార్క్ దక్కలేదు. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉన్నా కనీసం ఆ సినిమాలు చూసేవారు లేక థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం వరుణ్ కెరియర్ గురించి తను ఆలోచనలో పడ్డాడని అనిపిస్తుంది. సోలో హీరోగా చిన్నా చితకా కలిపి దాదాపు 15 సినిమాలు తీసిన ఈ హీరో ఇక సోలో హీరోగా పనికిరాడని అనుకుంటున్నారు ఫిల్మ్ వర్గాలు. ఇప్పటికే తీసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అవడంతో వరుణ్ ఢీలా పడ్డాడని అంటున్నారు. ఇక ఇప్పుడు మనోడు రూట్ మార్చి మల్టి స్టారర్ లో నటిస్తున్నాడు. ఆల్రెడీ ‘ డి ఫర్ దోపిడి ‘ సినిమా రిలీజ్ అయ్యింది దానిలో వరుణ్ క్యారక్టర్ ఓకే అనిపించినా అంతలా ఇంపార్టెంట్ లేదనే చెప్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ తో జోష్ మీదున్న సందీప్ కిషన్ డి ఫర్ దోపిడి లో కూడా తన మార్క్ ఈజ్ తో నటించాడు. ఇక వరుణ్ మంచు ఫ్యామిలీ కలిసి నటిస్తూ, తీస్తున్న పాండవులు పాండవులు తుమ్మెద లో కూడా ఉన్నాడు.. సో ఇదంత చూస్తుంటే వరుణ్ కి సోలో గా కెరియర్ ముగుసినట్లే అని అనుకుంటున్నారు. వచ్చిన మంచి అవకాశాలన్నీ ఏవేవో పిచ్చి పిచ్చి సినిమాలు తీసి తన కెరియర్ ని తానే పాడు చేసుకున్నాడని కూడా అనుకుంటున్నారు ఇంకొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: