కామ‌సూత్ర హీరోయిన్ అంటే అంద‌రికి గుర్తుకువ‌చ్చేది ముందుగా షెర్లిన్ చోప్రానే. షెర్లిన్ చోప్రా కామసూత్ర త్రిడి ఫిల్మ్‌లో న‌టిస్తుంది అనే ఒక్క కార‌ణంతోనే ఈ బ్యూటీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్‌డంను సంపాదించుకుంది. అలాగే ప్లేబాయ్ మ్యాగ్జైన్‌కు ఫోజులు ఇచ్చిన‌ మొద‌టి ఇండియ‌న్ మోడ‌ల్‌గా ఖ్యాతి గ‌డించింది. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా షెర్లిన్‌చోప్రా ఓ ప్రవేట్ వీడియో సాంగ్‌లో న‌టించింది. బ్యాడ్ గ‌ర్ల్ పేరుతో రిలీజ్ అయిన ఆ వీడియోలో షెర్లిన్ చోప్ర హాట్ లుక్‌తో అధ‌ర‌గొట్టింది. ఇంట‌ర్నేష‌నల్‌ మార్కెట్ ఉన్న ఫిగ‌ర్ చేత ఓ ప్రవేట్ వీడియో ఆల్బబ్‌ చేస్తే, దాని మీద వ‌చ్చే ఆదాయం అంతా ఇంతా కాదు. ఆ ఆల్భంకు కాసుల వ‌ర్షం కురిసిన‌ట్టే. అయితే షెర్లిన్ చోప్రా యాక్ట్ చేసిన ఈ వీడియో ఆల్బన్ ప‌రిస్థితిని చూస్తుంటే ఆ సీన్ రివ‌ర్స్ అయిన‌ట్టు క‌నిపిస్తుంది. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన బ్యాడ్‌గ‌ర్ల్ ఐటెం సాంగ్‌కు ఆధ‌ర‌ణ క‌రువైంది. అలాగే దానికి పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌లో క‌నీసం న‌ల‌భై శాతం కూడ వెనక్కి రావ‌డంలేదంట‌. ఆ వీడియో ఆల్భమ్‌లో షెర్లిన్‌చోప్ర న‌టించినందుకు ఏకంగా రెండు కోట్ల రూపాయ‌ల‌ను తీసుకుంది. మిగ‌తా ఖ‌ర్చుల‌ను క‌లుపుకొని మూడు కోట్ల రూపాయ‌ల‌తో ఆల్బమ్‌ను రెడీ చేశారు. ఇప్పుటి వ‌ర‌కూ ఆ ఆల్బమ్ మీద వ‌చ్చిన మ‌నీ కేవ‌లం కోటి మూప్పై ల‌క్షల రూపాయ‌లు మాత్రమే. దీంతో షెర్లిన్ చోప్ర మార్కెట్ ఇంత వీకా అంటూ బిటౌన్ నివ్వెర‌పోతుంది. ఇదే ఇలా ఉంటే కామ‌సూత్ర త్రిడి ప‌రిస్థితి ఏంటో అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: