రామ్ చరణ్ అబిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎవడు హడావిడి మొదలు అయింది. వాయిదాల నేపధ్యంలో చిట్టచివరకు ఈ చిత్రం జనవరి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపధ్యం లో ఈ చిత్రంలో డైలాగ్స్ అంటూ నెట్ లో కొన్ని డైలాగు లు ప్రచారం పొందుతున్నాయి.  అలా లీకెడ్ గా డైలాగు గా చెప్పబడుతూ మెగా అభిమానుల అందరి నోట్లో నానుతున్న డైలాగు ఇదే “అనుకోగానే వెళ్లి కలవడానికి ఆడు బోనులో సింహం కాదు, అడవిలో సింహం. ముందు వెతకాలి. వెతికేలోగా, మనం బ్రతకాలి ." మహేష్ ‘1’ సినిమా విడుదల మరో మూడు రోజులు ఆలస్యమై జనవరి 13న విడుదల అవుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మహేష్ సినిమా కన్నా ‘ఎవడు’ ఒక రోజు ముందు వచ్చే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు.  ఈ సంవత్సరం కూడా ‘సీతమ్మ’ సినిమా కన్నా ‘నాయక్’ రెండు రోజులు ముందుగా వచ్చింది అన్న విషయం తెలిసిందే. తిరిగి అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఈ సంవత్సరం లాగే అటు చరణ్ ఇటు మహేష్ లు ఇద్దరూ విజయాలు అందుకుంటారా లేకుంటే ఈ పోటీలో ఒక్కరే విజేతగా నిలుస్తారా అనే విషయం టాలీవుడ్ చాలా ఆశక్తిగా ఎదురు చూస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: