టాలీవుడ్ బబ్లి బ్యూటి నిత్యా మీనన్ మరోసారి తన తడాఖా ఏంటో చూపించింది. నిత్యామీనన్ ఇచ్చిన షాక్‌కి ఆ మేనేజర్‌కు ఏం చేయాలి అర్ధం కాక, జుట్టు పీక్కున్నంత పనైంది. ఇదంత షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జరగటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ విధంగా చేసింది నిత్యామీననేనా అంటూ అవాక్కయ్యారు. వెల్, మేటర్ ఏంటంటే నిత్యామీనన్ వద్దకు ఓ ఈవెంట్ మేనేజర్ మంచి డిమాండ్ ఉన్న ప్రొపోజల్‌ను తీసుకువచ్చాడు. ఇప్పుడు హీరోయిన్స్ ‌అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ‌మూడ్‌లో ఉన్నారు కాబట్టి, నిత్యా ముందు దానికి సంబంధించిన ప్రపోజల్‌ను తీసుకువచ్చాడు. హైదరాబాద్‌లోని ఓ పాపులర్ హోటల్‌లో మూడు గంటల పాటు న్యూ ఇయర్ బ్యాష్ పొగ్రామ్స్‌తో అలరిస్తే డెబ్పై లక్షల వరకూ చెల్లిస్తామన్నారు. ‘న్యూ ఇయర్ కోసం ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గోను’ అని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందంట. అయితే ఆ మేనేజర్ ఇంకొంచెం రేటు పెంచి, అందులో రెండు ఐటెం సాంగ్స్‌కు డ్యాన్స్ ‌పెర్ఫార్మెన్స్ ‌ఇస్తే చాలు అన్నాడంట. దీంతో ఒళ్ళుమండిన నిత్యా, ఆ మేనేజర్‌ను అక్కడిక్కడే కడిగిపారేంది. ‘ఏం మాట్లాడుతున్నారో అర్ధం అవుతుందా? ఈవెంట్స్‌లో ఐటెం సాంగ్స్ ‌చేసే హీరోయిన్స్‌లా కనపడుతున్నానా’ అంటూ ఆ మేనేజర్‌ను దుమ్మురేపింది. దీంతో ఆ మేనేజర్ తన చెంప చెల్లుమనే జవాబు ఇచ్చిందంటూ ఆ చిత్ర యూనిట్ దగ్గర వాపోయాడంట. తెలుగు హీరోలనే లెక్కచేయని నిత్యామీనన్‌కు మేనేజర్ ఓ లెక్కా అంటుంది టాలీవుడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: