మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ 2013వ సంవ‌త్సరంలో త‌న మూవీల దూకుడును త‌గ్గించినప్పటికి, 2014లో వ‌రుస మూవీల‌ను చేయ‌టానికి ప్లానింగ్స్ వేసుకుంటున్నాడు. 2013లో నాయ‌క్ మూవీ చ‌ర‌ణ్‌కు సంతోషాన్ని ఇచ్చిన‌ప్పటికి, భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయిన జంజీర్ మూవీ డిజాస్టర్‌ను ఇచ్చి, చేదు జ్ఞాప‌కాల్ని మిగిల్చింది. దీంతో చ‌ర‌ణ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఎవ‌డు మూవీ ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా, ఆ మూవీ కాస్త ప‌లు కార‌ణాల‌తో వాడుదాలు ప‌డుకుంటూ ఏకంగా 2014కి వెళ్ళింది. ఈ విధంగా చ‌ర‌ణ్‌కు 2013 సంవ‌త్సరం నిరాశ‌ను మిగిల్చింది. అయితే 2014లో చ‌ర‌ణ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తున్నాడు. తెలుగులో రెండు మూవీల‌ను పూర్తి చేయాల‌ని ప్లానింగ్స్ వేసుకుంటున్నాడు. అలాగే హిందీలో ఓ మూవీకు ప‌నిచేస్తున్నాడు. ‘లగాన్’, ‘స్వదేశ్’ వంటి హిందీ సినిమాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఒక పెద్ద చారిత్రాత్మక సినిమాను తెర‌కెక్కించబోతున్నాడు. ఈ మూవీలో చ‌ర‌ణ్‌కు లీడింగ్ రోల్ ఇవ్వాల‌ని, వీరిమ‌ధ్య రీసెంట్‌గానే చ‌ర్ఛలు జ‌రిగాయ‌ని టాలీవుడ్‌ సమాచారం. ఈ మూవీ వ‌చ్చే సంవ‌త్సరం స్టార్ట్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ఉంది. గ‌తంలో వీరిద్దరూ ఒక పెప్సీ యాడ్ ప్రమోష‌న్‌కు క‌లిసి పనిచేసిన సంగతి తెలిసిందే. అలాగే త్వర‌లోనే రామ్‌చ‌ర‌ణ్, కృష్ణ వంశీ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ళనుంది. ఈ విధంగా చ‌ర‌ణ్ 2014లో రెండు తెలుగు మూవీల‌ను రిలీజ్ చేసుకునే విధంగా, అలాగే బాలీవుడ్ మూవీ షూటింగ్‌తో బిజిబిజిగా గ‌డిపేలా ప్లానింగ్స్ వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: