టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఒక్క సారిగా గుప్పుమంది. టాలీవుడ్ టాప్ హీరోగా ఖ్యాతి గ‌డిస్తున్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మూడో పెళ్లి అనేది త‌న వ్యక్తిగ‌త విష‌యం. ఈ న్యూస్‌ను మాత్రం మీడియా బ్రేకింగ్ న్యూస్‌తో అధ‌ర‌గొట్టింది. అయితే ఈ విష‌యాన్ని గ‌త ఎనిమిది నెల‌ల క్రిత‌మే ఓ న్యూస్ ఛాన‌ల్ బ‌య‌ట‌పెట్టిన‌ప్పటికి, అప్పుడు అంద‌రూ అవి నిరాధార వార్తలే అంటూ తోసిపుచ్చారు. కాని వారిచెప్పిన వార్తల్లో పెళ్లికూతురు క‌రెక్ట్ కాక‌పోయినా, ఈ సారి మాత్రం ఆధారాల‌తో న్యూస్‌ను టెలికాస్ట్ చేశారు. అయితే ఈ వార్తల‌పై ప‌వ‌న్ అభిమానులు మౌనంగా ఉంటున్నారు. ఈ న్యూస్‌కు సంబంధించిన ఆధారాలు చూపించినా ప‌ర్సన‌ల్‌ఫ్ పై నో కామెంట్స్ అంటూ అభిమాన హీరో చూపించిన దారిలోనే వెళుతున్నారు. దీనిపై మెగా ఫ్యామిలి నుండి ఎటువంటి కామెంట్స్ రాలేదు. మెగా హీరోల‌కు అండ‌గా ఉండే టాలీవుడ్ పెద్దలు సైతం, ఈ వార్తల‌పై స్పందించ‌టానికి ముందుకు రాలేదు. ఎవ‌రికి వారు 'వ్యక్తిగ‌త విష‌యాలపై ఎటువంటి కామెంట్స్ చేసే అర్హత మాకు ఉండ‌దు' అంటూ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు. ఈ విష‌యంలో ముఖ్యంగా అభిమానుల్లో కొద్దిపాటి నిరాశ క‌నిపించినా, 'ప‌వ‌న్ అనుస‌రిస్తున్న ఆశ‌య మార్గాలు, మంచివైన‌ప్పుడు వాటిని మాత్రమే మ‌నం ఫాలో అవ్వాలి. మిగ‌తా విష‌యాలు మాకు ఎందుకు' అంటూ వారిదైన ప‌వ‌నిజాన్ని ఫాలో అవుతున్నారు. మొత్తంగా ఎంత‌టి సెల‌బ్రిటికైన ప‌ర్సన‌ల్ లైఫ్ ఉంటుంది. దానిలో తొంగిచూసే ప్రయ‌త్నం క‌రెక్ట్ కాదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: