న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో హీరోయిన్స్ యమ క్రేజ్ ఉంది.. ఆ రోజు ఒక్క నైట్ డ్యాన్స్ చేస్తే లక్షలకు లక్షలు ఇస్తున్నాయి కొన్ని కార్పోరేట్ సంస్థలు. ఆ విధంగానే ఒక పెద్ద కార్పోరేట్ సంస్థ నిత్యా మీనన్ కి ఆఫర్ ఇచ్చిందట అంతేకాదు తనకున్న యూత్ క్రేజ్ ప్రకారం అమ్మడికి దాదపు 70 లక్షల దాకా ఇస్తామన్నారట.. కానీ దానికి నిత్య ఒప్పుకోలేదు. నైట్ పార్టీలంటే తనకు నచ్చవని చెప్పేసిందట. కానీ అంతకూ వదలని ఆ కంపెనీ వారు ఇంకా కావాలంటే ఎమౌంట్ ని కొంచం ఎక్కువ అయినా ఇస్తాం కాని ఒక షో చేయండి అని అడిగారట. దానితో అమ్మడికి చిర్రెత్తుకొచ్చి నేను ఎలా కనిపిస్తున్నాను..? డబ్బులు కోసం ఏలా అంటే అలా చేయడానికి నేను బజారు మనిషిని కాను అని క్లాస్ పీకిందట. మరి నైట్ షో లకు ఓకే అన్న హీరోయిన్లు ఈ మాట వింటే కొంచం ఫీల్ అవుతారు కావొచ్చు అయినా ఎవరి అభిప్రాయం వారిది కదా. యూత్ లో తనకున్న క్రేజ్ ని కాష్ చేసుకోవడానికి ఆ సంస్థ నిత్య తో స్టార్ నైట్ ఎర్పాటుచేద్దాం అనుకున్నారు కాని వారికి చుక్కెదురయ్యింది. అయితే నిత్య విషయానికొస్తే తను చేసే సినిమాలు కూడా ద గర్ల్ నెక్ష్ట్ డోర్ లానే చాలా సింపుల్ గా ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా మంచి ఇమేజ్ ని సాదించుకుంది. సో ఆ ఇమేజ్ ని కాపాడుకోవడం కోసమే తను ఇలా పార్టీలు డ్యాన్స్ షో లు చేయకుండా ఉంటేనే బెటర్ అని మనసులో ఉందట. మనకు ఇష్టం లేకున్నా భారి మొత్తం మన ఎకౌంట్ లో వస్తుంది అంటే ఆలోచించకుండా ఓకే అనేసే వారు చాలామంది హీరోయిన్లు ఉన్నారు.. మరి అదే నిత్య కి వేరే హీరోయిన్లకు ఉన్న తేడా..అని అనుకుంటున్నారు కొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: