ప్రస్తుతం బాబాయ్ - అబ్బాయ్‌ల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంద‌ని అన్న విషయం ఎవరికైనా తెలిసిందే. ఈ విషయాన్ని నంద‌మూరి అభిమానులు కూడా ఒప్పుకుంటారు. ఈ పరిస్థుతులకు త‌గ్గట్టుగానే బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ కొన్నాళ్ల నుంచీ ఎడ‌మొహం, పెడ‌మొహంగానే ఉంటున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. పార్టీలో తమ ఆదిపత్యాన్ని పెంచుకోవ‌డానికి ఇద్దరూ ఒకరి పై ఒకరు పోటీ పడ్డారు.  కానీ ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయాల కంటే సినిమాల పైననే ఎక్కువగా ఆశక్తి చూపెడుతున్నారు. గత కొంత కాలంగా పరాజయాల బాటలో ఉన్న వీరిద్దరూ తమ సత్తాను బాక్సాఫీసు ద‌గ్గర ఋజువు చేసుకోవడానికి ఒకే నెలను, వేదికగా తీసుకుని ఇంచుమించు ఒక వారం గ్యాప్ లో వీరు నటించిన సినిమాలు టాలీవుడ్ తెరపై దాడి చేయబోతున్నాయి అనే వార్త టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.  తెలుస్తున్న సమాచారం మేరకు వీరిద్దరూ నటించిన ‘లెజెండ్‌’, ‘ర‌భ‌స‌’లు ఇంచుమించు ఒకేసారి బాక్సాఫీసు ద‌గ్గర ఢీ కొట్టబోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ న‌టిస్తున్న ర‌భసని మార్చి 28న విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తుంది.  దానికి కాస్త అటూ ఇటుగా లెజెండ్ కూడా ముస్తాబు అవుతుంద‌ని స‌మాచార‌మ్‌. లెజెండ్‌ని ఫిబ్రవ‌రిలో తీసుకొద్దామ‌ని అనుకున్నా ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అవుతూ ఉండడంతో బాలయ్య కూడా మార్చి నెలనే ఎంచు కున్నాడని టాక్. ఏప్రిల్ లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బాలకృష్ణ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఎన్నికల ముందు నెల అయిన మార్చిని ఎంచు కున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బాబాయ్-అబ్బాయి ఒకే నెలలో వస్తారా రారా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: