మెగా హీరోలు ఈ మ‌ధ్య కాలంలో ప్రమోష‌న‌ల్ సాంగ్స్ అంటూ ప‌బ్లిసిటి స్టంట్‌ను క్రియోట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజోతున్న ఇద్దరి మెగాహీరోల మూవీలకు ప్రమోష‌న‌ల్ సాంగ్స్ రెడీ అవుతున్నాయి. వీటిలో అల్లుఅర్జున్ రేసుగుర్రం, అల్లు శిరీష్ కొత్తజంట మూవీలు ఉన్నాయి. అల్లుశిరీష్ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ కొత్తజంట‌. ఈ మూవీకు టాకీపార్ట్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అలాగే మ‌రోవైపు కొత్తజంట మూవీ పోస్ట్‌ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ మూవీకు సంబంధించిన ప్రమోష‌నల్ సాంగ్‌ను త్వర‌లోనే రిలీజ్ చేయ‌బోతున్నారు. అల్లుఅర‌వింద్‌ కొత్తజంట మూవీను వాలెంటైన్ డే స్పెష‌ల్‌గా రిలీజ్ చేయాల‌ని ప్లానింగ్స్ చేస్తున్నాడు. ఫిబ్రవ‌రి 14న మూవీ రిలీజ్ డేట్ దాదాపు ఖ‌న్‌ఫ‌ర్మ్ అవ్వడంతో, మూవీ ప‌బ్లిసిటీను కూడ డిఫ్రెంట్‌గా చేయ‌టానికి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో కొత్త జంట ప్రమోష‌నల్ సాంగ్ ఉంటుంది. అలాగే అల్లుఅర్జున్ న‌టిస్తున్న ఆప్‌క‌మింగ్ ఫిల్మ్ రేసుగుర్రం ప్రమోష‌నల్ సాంగ్ కూడ జ‌న‌వ‌రి నెల‌లోనే ఉంటుంది. రేసుగుర్రం మూవీ రిలీజ్ ఫిబ్రవ‌రి, మే నెల‌లో అని టాక్ వినిస్తుంది. అయితే ప్రమోష‌న‌ల్ సాంగ్‌ను మాత్రం జ‌న‌వ‌రిలోనే రిలీజ్ చేయ‌టానికి చిత్ర యూనిట్‌ రెడీ అవుతుంది. ఈ విధంగా అన్నద‌మ్ములిద్దరూ వారి మూవీల ప్రమోష‌న‌ల్ సాంగ్స్‌ను వైవిధ్యంగా ప్రమోట్ చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుండ‌టంతో, 2014లో ఈ రెండు మూవీలపై అభిమానుల్లో స్పెష‌ల్ క్రేజ్ నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: