స్వయం కృషితో టాలీవుడ్ లో ఎదిగిన హీరో నాని సాధారణ క్లాప్ బాయ్‌గా పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు క్రేజీ హీరో స్థాయికి ఎదిగాడు. క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని తన స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగాడు.  పరిశ్రమలో సంపాదించిన డబ్బుతోనే ఇప్పుడు నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరొక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే నాని భార్య అంజనా కూడా ఇపుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.  అయితే తెరపై మాత్రం కాదు. తెర వెనక విభాగంలో ఆమె తన టాలెంటును చూపించేందుకు ఉత్సాహం చూపిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమా నిర్మిస్తున్న ఆర్కా మీడియా సంస్థలో నాని భార్య కాస్టూమ్ డిజైనింగ్ డిపార్టు‌మెంటులో పని చేస్తున్నట్లు సమాచారం.  రాజమౌళి భార్య రమారాజమౌళితో కలిసి ఆమె పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న అంజన నాని అడుగు జడలలో నడుస్తూ ఈ రంగంలో ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: