ధూమ్‌3 క‌లెక్షన్స్ ప్రభంజ‌నం విశ్వరూపం దాల్చింది. ఈ మూవీ మొద‌టి రోజు నుండి ఇప్పటి వ‌ర‌కూ, ప్రతి రోజు క‌లెక్షన్ల దూకుడుతో ముందుకు వెళుతూనే ఉంది. మొన్నటి వ‌ర‌కూ బిటౌన్ క‌లెక్షన్స్ కింగ్‌లు ఎవ‌రు అంటే స‌ల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్ పేర్లు ఎక్కువుగా వినిపించాయి. కాని ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆ స్టార్ హీరోనే అమీర్‌ఖాన్‌. డిసెంబ‌ర్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ధూమ్‌3 క‌లెక్షన్స్ డిసెంబ‌ర్ 30 నాటికి 425.17 కోట్ల రూపాయ‌ల క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ ఫిగ‌ర్‌ను చూసిన ఇండియ‌న్ ట్రేడ్ పండితులు, అలాగే వ‌ర‌ల్డ్ బాక్సాపీస్ ట్రేడ్స్ సైతం అవాక్కవుతున్నారు. ఇండియ‌న్ బాక్సాపీస్‌కు ఇంతటి స్టామినా ఉందా? అని హాలీవుడ్ బాక్సాపీస్ క‌ళ్లు పెద్దవి చేసి మ‌రీ చూస్తుంది. ఓ ర‌కంగా చెప్పాలంటే ధూమ్‌3 మూవీ క‌లెక్షన్స్‌తో హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఇండియ‌న్ మూవీపై ఇన్వెస్ట్ చేయ‌టానికి బ‌డా నిర్మాణ‌ సంస్థలు ప్రత్యేక ఇంట్రెస్ట్‌ను చూపిస్తున్నాయి. దీనంత‌టి కారణం ఒకే ఒక్క మూవీ. అదే ధూమ్‌3. ఇప్పటి వ‌ర‌కూ ధూమ్‌3 మూవీ ఇండియాలో కొల్లగొట్టిన క‌లెక్షన్స్ 296.18 కోట్ల రూపాయ‌లు. అలాగే ఓర్సీస్ మార్కెట్ క‌లెక్షన్స్‌ 128.99 కోట్ల రూపాయ‌లు. ప్రపంచ వ్యాప్తంగా క‌లెక్షన్స్‌ను చూసుకుంటే 425.17 కోట్ల రూపాయ‌లుగా తేలింది. ఈ క‌లెక్షన్స్‌ను చూసిన ట్రేడ్ వ‌ర్గాలు సైతం ధూమ్‌3 క‌లెక్షన్స్ ఇండియ‌న్ సినిమా ధ‌మ్మును హాలీవుడ్‌కు చూపించినందుకు సంతోషంగా ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: