ఎవ‌రితో ఏ అవ‌స‌రం ఎప్పుడు, ఎలా వ‌స్తుందో తెలియ‌దు. కల‌ర్ ఫుల్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ ఆఫ‌ర్స్ అనేవి అలాగే ఉంటాయి. జూనియ‌ర్ ఆర్టిస్ట్ ఒక్కసారిగా సెల‌బ్రిటి అవ్కొచ్చు. టాప్ సెల‌బ్రిటి ఆఫ‌ర్ల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిర‌గొచ్చు. ఏదేమైనా బాలీవుడ్‌లో స్టన్నింగ్ హీరోయిన్‌కు ఓ ఆఫ‌ర్ వ‌చ్చింది. త‌ను ఊహించుకుండా ఇలా వ‌చ్చినందుకు కాదన‌కుండా వెంట‌నే ఒప్పేసుకుంది. వెల్‌, మేట‌ర్ ఏంటంటే న్యూ ఇయ‌ర్ సెలబ్రేష‌న్స్ కోసం బాలీవుడ్ బ్యూటి శ్రద్ధా క‌పూర్‌కి ఓ హాట్ ఆఫ‌ర్ వ‌చ్చింది. బాంద్రా ఏరియాలోని రెస్టారెంట్‌లో డిసెంబ‌ర్ 31 నైట్ స‌రిగ్గా డేట్ మారిపోయే స‌మ‌యంలో అయిదు నిముషాల పాటు ఎంట‌ర్‌టైన్ చేస్తే త‌న‌కు 32 ల‌క్షల రూపాయ‌ల‌ను ఇస్తామ‌ని ఈవెంట్ నిర్వాహుకులు చెప్పారు. వెంట‌నే కాద‌న‌కుండా శ్రద్ధాక‌పూర్ ఒప్పుకుంది. ఆషికి2 మూవీలో కుర్రకారు హీరోయిన్‌గా, చెర‌గ‌ని ముద్ర వేసుకున్న శ్రద్ధాక‌ప‌ర్‌కి బాలీవుడ్‌లో విపరీత‌మైన క్రేజ్ ఉంది. శ్రద్ధాక‌పూర్ స్టార్‌డంను వాడుకోవాల‌ని త‌న‌కు ఈ ఆఫ‌ర్‌ను ఇచ్చిన‌ట్టు ఈవెంట్ మేనేజ్‌మెంట్ చెబుతుంది. అయితే త‌న‌కి మ‌రో ఆఫ‌ర్ కూడ ఇచ్చారు. ఆషికి2 మూవీలోని మ‌రో రెండు సాంగ్‌ల‌ను త‌న పాడి వినిపిస్తే, మ‌రో ప‌ది ల‌క్షలు ఇస్తామ‌ని అన్నారు. అయితే త‌ను మాత్రం మొద‌టి ఆఫ‌ర్ అయిన‌ అయిదు నిముషాల‌కు ముఫ్పై రెండు ల‌క్షల ఆఫ‌ర్‌కే రెడీ అయ్యింది. మ‌నీ పేమంట్ కూడ ముందే జ‌రిగిపోవాల‌ని కండిష‌న్ పెట్టింద‌ట‌. అందుకు వాళ్ళు ఓకె అన్నారు. శ్రద్ధాకు వ‌చ్చిన ఆఫ‌ర్‌ను చూసి 'వెరీ స్మార్ట్ డీల్' అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: