మాస్ ఇమేజ్ తో కెరియర్ స్టార్ట్ చేసిన ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ లాంటి ఫ్యామిలి ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడుగా తన చరిష్మా ను ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్..అంతేకాదు అమ్మయిల కలల రాకుమారుడిలా సూపర్ క్రేజ్ సంపాదించాడు.. ఇప్పుడు భాహుబలి సినిమా ద్వారా పోరాట యోదుడి లా స్క్రీన్ మీద కనిపించ బోతున్నాడు. గతంలో రాజమౌలి దర్శకత్వం లో చత్రపతి లో నటించిన ప్రభాస్ తన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా ఆ సినిమా నిలిచేలా చేసుకున్నాడు. ఇప్పుడు రాజమౌలి మీద ఉన్న అదే నమ్మకంతో భాహుబలి సినిమా కు రెండు సంవత్సరాలు డేట్స్ కేటాయించాడట. ఈ రెండు సంవత్సరాల కాలంలో మిగతా హీరోలు మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే ప్రభాస్ మాత్రం భాహుబలి సినిమాకే అంకిత మయ్యాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందే మరో సినిమా అనౌన్స్ చేసినప్పటికి అనివార్యకారణాల వల్లవాయిదా పడింది. ప్రభాస్ ఈ ఒక్క సినిమాకే అంకితమవ్వడానికి భారీ రెమ్యూనరేషన్ ఒక కారణమైతే, ఈ సినిమాను రెండు బాగాలుగా రూపొందించడం మరో కారణమై ఉంటుంది. ఏదేమైనా సినిమాలు చేయడంలొ గ్యాప్ తీసుకుంటే కెరియర్ పరంగా మాత్రం వెనక పడే అవకాశం ఉంది. మరి ప్రభాస్ ఇదంతా ఆలోచించే చేస్తున్నాడా లేదా ఒక్క సినిమా తీసినా చరిత్రలో మిగిలిపోవాలని ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: