బాలకృష్ణ తన అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తున్నాడు అది ఎలాగంటే తను ఓయపాటి కాంబినేషన్ లో తీస్తున్న లెజెండ్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు నెట్ లో అప్ లోడ్ చేయనున్నారు చిత్ర యూనిట్. చాలాకాలంగా ఫ్లాప్స్ తో నీరసపడ్డ బాలకృష్ణ కు సిం హా లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది కాబట్టి అభిమానులు ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా గురించి సినిమాలో హీరో క్యారక్టర్ గురించి ఈగర్ గా వెయిట్ చేసే అభిమానులకు టీజర్ రిలీజ్ చేసి వారి అంచనాలను ఇంకా ఎక్కువ చేయడం ఇప్పుడు హీరోల నయా ట్రెండ్ సో ఆ విధంగానే న్యూ ఇయర్ కానుకగా బాలయ్య లెజెండ్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. దేవి బాలయ్య సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొడటిసారి. అంతేకాకుండా దూకుడు తో సూపర్ హిట్ కొట్టి స్టార్ ప్రొడ్యూసర్స్ గా ఎదిగిన రాం ఆచంట,గోపి ఆచంట , అనీల్ సుంకరా ఈ సినిమా ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా రాధికా ఆప్టే నటిస్తుంది. మార్చి 28 న లెజెండ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.. సో న్యూ ఇయర్ టాలీవుడ్ బాలయ్య టీజర్ తో మొదలవుతుందన్న మాట..

మరింత సమాచారం తెలుసుకోండి: