ఇంతవరకు తమన్నా ఒక గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే మనకు తెలుసు కాని తను చేస్తున్న నెక్ష్ట్ సినిమా ఆగడులో తమ్ము పోలీస్ పాత్ర చేయబోటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. సూపర్ స్టార్ మహేష్ సరసన మొదటిసారి నటిస్తున్న మిల్కీ బ్యూటీ.. ఈ సినిమాలో లేడీ పోలీస్ గా చేస్తుందట. ఆల్రెడీ మహేష్ ఆగడు లో మరోశారి పోలీస్ గెటప్ వేస్తున్నాడని లీక్ చేశారు కాని హీరోయిన్ కూడా పోలీస్ గా చేస్తుందటంతో ఈ సినిమా పై ఆడియెన్స్ ఎక్స్ పెటేషన్స్ పెరిగాయి. దూకుడు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా మరోసారి శ్రీను వైట్ల తన పనితనాన్ని చూపించనున్నాడు..ఇక తమన్న ని కూడా లేడీ పోలీస్ గా డిసైన్ చేశాడాంటే శ్రీను వైట్ల మళ్లో సూపర్ డూపర్ హిట్ కి ప్లాన్ వేశాడని అనుకుంటున్నాయి సినీ వర్గాలు.. మహేష్ తో ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తున్న తమన్నా ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది. 2013 మొత్తం అన్ సాటిస్ఫైడ్ గా సాగిన తమన్నకు మహేష్ సినిమా మాంచి కిక్ ని ఇస్తుందని ఆశిస్తుంది. ఈ సినిమా ను 14 రీల్స్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.. మహేష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తీస్తున్న వీరు త్వరలో రిలీజ్ కి రెడీ గా ఉన్న '1' మీద చాలా హోప్స్ పెట్టుకున్నాట్లు తెలుస్తుంది. సో మొత్తానికి లాస్ట్ ఇయర్ మిగిలిన అసంత్రుప్తి తమన్న కి 2014 లో కలగకూడదని తను చేస్తున్న ఈ పోలీస్ పాత్ర అందరిని అలరించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: