డిసెంబ‌ర్ 31తో 2013వ సంవ‌త్సరం ముగింపుకు వ‌చ్చింది. అయితే ఈ సంవ‌త్సరంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మూవీల స‌క్సెస్ రేటు ఎలా ఉందో, దానికి మూడు రెట్లు ప్లాపుల‌ను చూసింది. ఏదేమైనా మొత్తానికి 2013వ సంవ‌త్సరం టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు కొంత లాభాలు, ఎక్కువ న‌ష్టాల‌ను చ‌విచూసింది. ఇక రాబోతున్న సంవ‌త్సరంలో ఏ మూవీ మొద‌టి స‌క్సెస్‌ను కొట్టిద్దో అంటూ టాలీవుడ్ ఆశ‌క్తిగా ఎద‌రుచూస్తుంది. 2014వ సంవ‌త్సరం, జ‌న‌వరి నెల‌లో మొత్తంగా తొమ్మిది మూవీల వ‌ర‌కూ రిలీజ్ అవుతున్నాయి. ఇందులో రెండు మూవీలు జ‌న‌వ‌రి 1వ తేధీనే రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఒక‌టి అర‌వ‌వింద్ కృష్ణ హీరోగా న‌టించిన బిస్కెట్ మూవీ టాలీవుడ్ స్క్రీన్స్‌ను ట‌చ్ చేస్తుంది. ఇట్స్ మై ల‌వ్ స్టోరి, రుషి మూవీల‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య అయిన అర‌వింద్‌కృష్ణ, బిస్కెట్ మూవీతో న్యూ ఇయ‌ర్ బాక్సాపీస్‌కు రెడీ అయ్యాడు. అలాగే మ‌రో మూవీ శ్రీకాంత్ న‌టించిన క్షత్రియ, జ‌న‌వ‌రి 1నే రిలీజ్ అవుతుంది. ఈ రెండు మూవీలు న్యూ ఇయ‌ర్ మొద‌టి రోజే బాక్సాపీస్‌ను ఢీ కొడుతున్నాయి. ఇవి కాకుండా రామ్‌చ‌రణ్ న‌టించిన ఎవ‌డు మూవీ, ప్రిన్స్ మ‌హ‌ష్ బాబు వ‌న్ మూవీ, నితిన్ హ‌ర్ట్ ఎటాక్ మూవీ, నాగ‌చైత‌న్య న‌టించిన ఆటోన‌గ‌ర్ సూర్య, మంచు ప్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద మూవీలు అన్నీ జ‌న‌వ‌రి నెల‌లోనే రిలీజ్ అవుతున్నాయి. మొత్తంగా న్యూ ఇయ‌ర్ మొద‌టి నెల అంతా మూవీల రిలీజ్‌ల‌తో టాలీవుడ్ బాక్సాపీస్ సంద‌డిగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: