ఏంటి నిజమేనా జనవరి 10న మనం సినిమా వస్తుందా అనుకుంటున్నారా..? అదికాదండి ఇక్కడ మ్యాటర్ జనవరి 10 న మనం ట్రైలర్ వస్తుంది. మహేష్ సినిమాతో పాటు మనం సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు మనం చిత్ర యూనిట్. మహేష్ సినిమాతో పాటే వస్తే పబ్లిసిటీ బాగా వస్తుందని మనం చిత్ర యూనిట్ నమ్మకం. తమిళ్ లో 13 బి సినిమా తీసి ఇక్కడ దాదాపు కెరియర్ అయిపోయింది అనుకున్న నితిన్ ని మళ్లీ స్టార్ హీరోగా చేసిన ఇష్క్ సినిమా దర్శకుడు విక్రం ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు.మూడు తరాల అక్కినేని ఫ్యామిలీ సినిమా కాబట్టి ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు.. ఇప్పటికే ఏ.యన్.ఆర్ బర్త్ డే కి వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని అశ్చర్య పడేలా చేసింది మరి ఇక సినిమా ఎలా ఉండబోతుందన్నది తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. అక్కినేని అఖిల్ కూడా ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ చేస్తున్నాడట.. సిసింద్రీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ముద్దు ముద్దుగా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో తన కెరియర్ ప్లాన్ ని సెట్ చేసుకోనున్నాడు.. మొన్నటి వరకు అఖిల్ ఉన్న విషయాన్ని చిత్ర యూనిట్ బయటపెట్టలేదు కాని ఉండబట్టలేక సమంత విషయాన్ని బయట పెట్టేసింది. సో మొత్తానికి మనం చిత్రం ట్రైలర్ జనవరి 10 న థియేటర్ లో సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: