సూపర్ స్టార్ మహేష్ అప్ కమింగ్ మూవీ '1' నేనొక్కడినే. మహేష్ ని చాలా స్టైలిష్ గా రాక్ స్టార్ లా డిజైన్ చేశాడు సుకుమార్.. కానీ ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా బార్న్ ఐడెంటిటీ.. ఈ సినిమా ఆధారంగానే '1' సినిమా వస్తుందని చెబుతున్నారు. మరి ఈ సినిమా ఆ సినిమాకి పోలిక ఉంటుందా ఉండదా అని రిలీజ్ అయితే కానీ తెలియదు.  కానీ ఈ మధ్య మన వాళ్లు తరచు ఏదో ఒక హాలీవుడ్ సినిమాను ఇన్స్ ప్రేషన్ గా తీసుకుని కథలు తయారుచేసుఇకుంటున్నారు. దానికి ఉదాహరణ దర్శక ధీరుడు రాజమౌలి తీసిన విజువల్ వండర్ ఈగ కూడా కాక్రోచ్ అనే హాలీవుడ్ సినిమాని పోలి ఉంటుంది. మరి 1 సినిమా బార్న్ ఐడెంటిటీ ఇన్స్ ప్రేషన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.. మాట్ డామన్ , ఫ్రాంకా పొటంటే లీడ్ రోల్ లో నటించే బార్న్ ఐడెంటిటీ దాగ్ లిమన్ దర్శకత్వం వహించాడు.  అసలు దీనికి బలాన్ని చేకూర్చిన విషయం ఏంటంటే మహేష్ హు ఆర్ యు సాంగ్ లో వచ్చే పదాలు ఆలోచిస్తే తెలుస్తుంది.. అసలు నీవెవరు అని తనకు తానే ప్రశ్నిచుకుంటున్నాడని కాబట్టే ఇది ఆ సినిమాతో పోల్చడమైనదని అంటున్నారు. సో మొత్తానికి సుకుమార్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: