కొత్త సంవత్సరం ప్రారంభంరోజున అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ‘రుద్రమదేవి' సినిమాకు సంబంధించిన ఓ హాట్ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క బికినీలో కనిపించనున్నదట. చారిత్రక నేపథ్యం ఉన్న ఈసినిమాలో బికినీలేంటి? అనే సందేహం మీకు రావచ్చు. అది ఇప్పటి హీరోయిన్లు వేసే బికినీ కాక పోయినా ఆ తరహాలో ఉంటుందట.  ఇటీవల కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన షూటింగులో ఇందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారట. గుణా టీం వర్క్ పతాకంపై గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి'.  ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబిక గా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తున్నారు.  తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా గా దీనిని రూపొందించి దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్న ప్రధాన లక్ష్యoతో గుణశేఖర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకoగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక సినిమాలో అనుష్క హాట్ సీన్లు ఏమిటి అంటే ఈ సినిమా వచ్చేదాకా ఆగాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: