జ‌న‌వ‌రి 10న వ‌న్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీకు సంబంధించిన ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను నేడు రిలీజ్ చేశారు. ఇందులో ప్రిన్స్‌మ‌హేష్‌బాబు సింగిల్ డైలాగ్ చెప్పాడు. మూవీ మొత్తం యాక్షన్ ఎపిసోడ్‌లా ఉంటుంద‌ని, ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే వ‌న్ మూవీకు సంబంధించిన రెండు సాంగ్ టీజ‌ర్‌ల‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా వ‌న్ మూవీ ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను చేశారు. ఈ ట్రైల‌ర్‌లో వ‌న్ మూవీ షూటింగ్ లొకేష‌న్స్ చాలా రిచ్‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఒక నిముషం నిడివి ఉన్న ట్రైల‌ర్‌లో ప్రిన్స్ చెప్పిన డైలాగ్, క‌థ‌లోని బ‌లాన్ని, వేగాన్ని తెలియ‌జేస్తుంది. మొత్తంగా ప్రిన్స్‌ అభిమానులు ఈ ట్రైల‌ర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు స‌ర‌స‌న కృతిస‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ మూవీతో కృతిస‌న‌న్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అవుతుంది. వ‌న్ మూవీకు పోటీగా ఎవ‌డు మూవీ రిలీజ్ అవ్వడంతో ఈ రెండు మూవీల‌కు విప‌రీత‌మైన ప‌బ్లిసిటి ఏర్పడుతుంది. ఎవడు మూవీ ట్రైల‌ర్ కంటే ముందుగానే ఎవ‌రు ఊహించని విధంగా వ‌న్ మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌డంతో, వ‌న్ మూవీ ప‌బ్లిసిటి స్ట్రాట‌జీ ఏంటో దిల్‌రాజుకి అంతు చిక్కడం లేదు. మొత్తంగా జ‌న‌వ‌రి 10న వ‌న్ మూవీ, జ‌న‌వ‌రి 12న ఎవ‌డు మూవీల‌తో టాలీవుడ్ బాక్సాపీస్ హీటెక్కడం ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: