మెగా హీరో అల్లుఅర్జున్ సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్‌ని చూసి పోటీ హీరోలు కళ్లు తెరిచారు. అల్లుఅర్జున్ తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు పథకాల్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ రికార్డుల మాట ఎలా ఉన్నా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో మాత్రం తనకు ఎవరూ సాటి రాలేరని అల్లుఅర్జున్ ప్రూవ్ చేసుకున్నాడు. తన ఫేస్‌బుక్ పేజ్‌కి 25 లక్షల లైకింగ్స్‌ని సాధించుకొని తన పోటీ హీరోలకు అందనంత ఎత్తుకి చేరుకున్నాడు. యూత్‌లో ఇప్పుడు ఫేస్‌బుక్‌కి పిచ్చ క్రేజ్ ఉంది. తమ పేజ్‌కి ఎంత ఎక్కువ లైక్స్ ‌ఉంటే అంత క్రేజ్ ఉన్నట్టు లెక్కకడుతున్నారు. ఇక, అల్లుఅర్జున్ విషయానికొస్తే, ఆయన ఫేస్‌బుక్ పేజ్‌కి ఉన్న లైకుల సంఖ్య 25 లక్షల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ టీమ్ సైతం నిర్దారించింది. అల్లుఅర్జున్ ఫేస్‌బుక్ రికార్డ్ ‌ఫ్యాన్స్‌లోనే సినీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. బన్ని ఫ్యాన్స్ ‌సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మిగతా హీరోలు తమ ఫేస్‌బుక్ ఫేజీలపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోని వీరు ఇప్పుడు తమదైన రికార్డుల్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మొత్తానికి, అల్లుఅర్జున్ సరికొత్త రికార్డ్ ‌కారణంగా మిగతా హీరోల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ రేసుగుర్రం చేస్తున్నాడు. దీనిని సురేందర్‌రెడ్డి డైరెక్ట్ ‌చేస్తున్నాడు. వీరిద్దరికి ఇదే తొలి కలయిక కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, ఇద్దరమ్మాయిలతో అల్లుఅర్జున్, ఊసరవెల్లి చిత్రంతో సురేందర్‌రెడ్డి అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఏదేమైనా, రేసుగుర్రంతో తమ గత చిత్రాల పరాభవాలకు బదులు తీర్చుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: