రచయితగా తన ప్రయాణాన్ని 12 సంవత్సరాలు పూర్తి చూసుకున్న సందర్భంలో రచయిత చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ తాను మెగా పొలిటికల్ స్టార్ చిరంజీవి కోసం ప్రస్తుతం తాను ఒక కధను రాస్తున్నానని చెప్పాడు. ఆకధ చిరంజీవి 150వ సినిమాగా బాగా నప్పుతుందనీ అందుకనే నిన్న కొత్త సంవత్సరం రోజున చిరంజీవికి తాను రాస్తున్న కధ నచ్చాలని దేవుడిని కోరుకున్నాను అని అంటున్నాడు ఈ వివాదాస్పద రచయిత.  గతంలో చిరంజీవికి ‘ఇంద్ర’ లాంటి సూపర్ హిట్ సినిమాకు కధను ఇచ్చిన చిన్ని కృష్ణ, బాలకృష్ణ, అల్లుఅర్జున్, జూనియర్లకు గతంలో వారి సినిమాలకు సంబందింఛి కధలను అమ్దిమ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు భాగ్యరాజా, శంకర్ ల ప్రియశిష్యుడుగా పేరుగాంచిన చిన్ని కృష్ణ ఈ సంవత్సరంలో చిరంజీవి 150వ సినిమాకు కధ ఇవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, సూర్య, అల్లుఅర్జున్ సినిమాలను వారు డేట్స్ ఇస్తే రికార్డులను క్రియేట్ చేస్తే కధలు వ్రాయడమే కాకుండా వారితో సినిమాలను డైరెక్ట్ చేస్తాను అని అంటున్నాడు ఈ సంచలన రచయిత.  అంతేకాదు ఎ మధ్యనే తాను ముంబాయిలో ఇల్లు కొనుకున్నాను అని చెప్పిన చిన్ని కృష్ణ ద్రుష్టి బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ అమీర్ ఖాన్ లపై కూడా పడడంతో భవిష్యత్ లో చిన్ని కృష్ణ హవా బాలీవుడ్ లో కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: