జీన్స్ ప్రశాంత్ గుర్తుండే ఉంటాడు.. లాస్ట్ ఇయర్ మనముందుకు రాజ కోట రహస్యం అనే సినిమాతో వచ్చాడు కానీ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎంత ప్రయత్నించినా రాజ కోట రహస్యం మాత్రం హిట్ చేసుకోలేక పోయాడు. ఇప్పుడు తమిళ్ లో కూడా అంత క్రేజ్ ఏం లేదు ప్రశాంత్ కి మధ్య లో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకునే సరికి కొత్త రక్తం తో యువ యాక్టర్స్ వచ్చి సూపర్ యాక్టింగ్ తో ఇరగదీస్తున్నారు, సో వారికి పోటీ ఇద్దామనుకుంటున్నా ఎప్పటికప్పుడు వెనుకబడుతున్నాడు ప్రశాంత్. ఇప్పుడు ప్రశాంత్ మరో సినిమా చేయబోతున్నాడట ఈ విషయాన్ని డైరక్టర్ , యాక్టర్ , ప్రొడ్యూసర్ అయిన ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమా టైటిల్ ని సాహసం అని పెట్టారట.. సాహాసం అనగానే లాస్ట్ ఇయర్ గోపీచంద్ , చంద్రశేఖర్ యేలేటి చేసిన సాహసం సినిమా గుర్తొస్తుంది కానీ కథ మాత్రం వేరేనట. ఈ విశేషాలన్నీ ప్రశాంత్ ఫాదర్ త్యాగరాజన్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టాడట. ప్రశాంత్ కోలీవుడ్ లో సినిమా తీసి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది 2011 లో పొన్నార్ శంకర్, మంబట్టియన్ సినిమాలతో తమిళ్ ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ ఇప్పుడు సాహసం తో వస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని త్యాగరాజన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: